ETV Bharat / bharat

టీకా ట్రయల్స్ డేటాపై కేంద్రానికి సుప్రీం నోటీసులు - కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్

కరోనా టీకా క్లినికల్ ట్రయల్స్ డేటాను ప్రజలకు బహిరంగంగా అందుబాటులో ఉంచాలంటూ దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు పరిశీలించింది. దీనిపై స్పందించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది.

sc vaccine trials data
టీకా ట్రయల్స్ డేటా
author img

By

Published : Aug 9, 2021, 12:24 PM IST

Updated : Aug 9, 2021, 3:02 PM IST

కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ డేటా సహా వ్యాక్సినేషన్ అనంతర సమాచారాన్ని బహిరంగపరచాలని దాఖలైన పిటిషన్​పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతర్జాతీయ వైద్య ప్రమాణాల ప్రకారం టీకా ట్రయల్స్ డేటాను ప్రభుత్వం తప్పక పబ్లిష్ చేయాల్సి ఉంటుందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ విన్నపాన్ని పరిశీలించిన దేశ అత్యున్నత ధర్మాసనం.. స్పందన కోరుతూ కేంద్రంతో పాటు, టీకా తయారీ సంస్థలైన భారత్ బయోటెక్, సీరం ఇన్​స్టిట్యూట్​కు నోటీసులు జారీ చేసింది.

దేశంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో టీకాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సుప్రీం పేర్కొంది. ఈ పిటిషన్​పై విచారణకు ఆదేశిస్తే.. ప్రజల్లో అనుమానాలు రేకెత్తించినట్లు కాదా అని ప్రశ్నించింది. ప్రతి ఒక్కరు టీకా తీసుకునే వరకు ఎవరూ సురక్షితం కాదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వ్యాఖ్యలను జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, జస్టిస్ అనిరుద్ధ బోస్​తో కూడిన బెంచ్ ప్రస్తావించింది.

"మన దేశంలో టీకా అపోహ అనే సమస్యపై పోరాడుతున్నాం. కరోనా పోరులో ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఇదొకటని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. మేం ఈ పిటిషన్​పై దర్యాప్తునకు ఆదేశిస్తే.. ప్రజల ఆలోచనల్లో అనుమానాలు రేకెత్తించినట్లు కాదా?"

-సుప్రీంకోర్టు

అయితే, పిటిషనర్ల తరపున వాదించిన అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్.. ఇది టీకా వ్యతిరేక వ్యాజ్యం కాదని వివరణ ఇచ్చారు. టీకా ట్రయల్స్ డేటా ప్రచురించే విషయంలో పారదర్శకత ఉండాలని అన్నారు. డేటా బహిరంగంగా అందుబాటులో ఉంచకపోతే.. పుకార్లు వ్యాపిస్తాయని, ఇది మరింత ఆందోళనలకు దారి తీస్తుందని చెప్పుకొచ్చారు. టీకా సమాచారం గురించి అందరికీ తెలిస్తే.. వ్యాక్సిన్లపై ఉన్న అనుమానాలు నివృతి అవుతాయని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్​ను అడ్డుకోవాలని తాము ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు. తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవడం, టీకా తీసుకోకుంటే నిర్దిష్ట ప్రదేశాలకు వెళ్లకుండా నిరోధించడం వంటి అంశాలను ప్రస్తావించారు.

అనంతరం స్పందించిన ధర్మాసనం.. టీకా సమర్థతపై శాస్త్రీయ నిర్వచనాల జోలికి తాము వెళ్లడం లేదని పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజా ఆరోగ్యం మధ్య సమన్వయం ఉండాలని అభిప్రాయపడింది. ఎట్టి పరిస్థితుల్లో వ్యాక్సినేషన్​ను అడ్డుకునేది లేదని తేల్చిచెప్పింది. ఇప్పటికే 50 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయని తెలిపింది. తాము టీకాపై అనుమానాల గురించి కాకుండా అంతకుమించి ఆలోచిస్తున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: ''క్విట్ ఇండియా'తో వలసవాదంపై పోరు బలోపేతం'

Last Updated : Aug 9, 2021, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.