మహారాష్ట్రలో నమోదైన క్రిమినల్ కేసుల్లో ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్‌ను అరెస్ట్ చేయకుండా సుప్రీంకోర్టు (param bir singh supreme court) రక్షణ కల్పించింది. తనపై నమోదైన కేసులు సహా మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని పరంబీర్ సింగ్ దాఖలుచేసిన పిటిషన్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం,డీజీపీ, సీబీఐ అభిప్రాయం కోరుతూ కోర్టు నోటీసులు జారీచేసింది.
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సింగ్ అవినీతి ఆరోపణలు చేశారు పరంబీర్ సింగ్. ఆ తర్వాత ఆయనపై రెండు, మూడు కేసులు నమోదయ్యాయి. వాటిపై ముంబయి పోలీసులు నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీచేయడంతో.. అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి (param bir singh missing) వెళ్లిపోయారు. గతవారం పరంబీర్ సింగ్ వాజ్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ముందు ఆయనెక్కడున్నారో చెబితేనే విచారణ కొనసాగిస్తామని తెలిపింది. పరంబీర్ ఎక్కడికీ పారిపోలేదని, భారత్‌లోనే ఉన్నారని ఆయన న్యాయవాది సోమవారం కోర్టుకు తెలిపారు. ఆయన మహారాష్ట్రలోకి అడుగుపెడితే ముంబయి పోలీసుల నుంచి ముప్పు పొంచి ఉందని వాదించారు.
అందుకే అరెస్టు నుంచి రక్షణ కోరుతున్నట్లు చెప్పగా పరంబీర్‌కు అరెస్టు నుంచి ధర్మాసనం రక్షణ కల్పించింది. తదుపరి విచారణను డిసెంబరు 6కు వాయిదా వేసింది. మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో తప్పనిసరిగా దర్యాప్తునకు హాజరుకావాలని పరంబీర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇదీ చూడండి: పాక్ విమానాన్ని కూల్చేసిన అభినందన్‌కు 'వీర్ చక్ర'