ETV Bharat / bharat

13 హైకోర్టులకు నూతన సీజేలు- సుప్రీం కొలీజియం సిఫార్సు

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​.వి. రమణ(supreme court chief justice) నేతృత్వంలో సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో నియమాకాలు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా.. దేశంలోని 13హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది సీజేఐ నేతృత్వంలోని కొలీజియం(sc collegium news).

SC collegium recommends names to Centre, 13 HCs to get new Chief Justices
సుప్రీంకోర్టు
author img

By

Published : Sep 21, 2021, 1:18 PM IST

Updated : Sep 21, 2021, 1:55 PM IST

దేశవ్యాప్తంగా 13 హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులు రానున్నారు. ఈ మేరకు జస్టిస్​ ఎన్​.వి. రమణ(supreme court chief justice) నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం(sc collegium news).. కోల్​కతా హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్​ రాజేశ్​ బిందాల్​ సహా ఎనిమిది మంది పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. మరో ఐదుగురు ప్రస్తుత సీజేలను బదిలీ చేయాలని ప్రతిపాదించింది.

16వ తేదీన జరిగిన కొలీజియం భేటీకి సంబంధించిన నిర్ణయాలను సుప్రీంకోర్టు వెబ్​సైట్​లో పొందుపరిచారు. సుప్రీంకోర్టు సిఫార్సులను కేంద్రం ఆమోదిస్తే.. జస్టిస్​ రాజేశ్​ బిందాల్​.. అలహాబాద్​ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. జస్టిస్​ బిందాల్​తో పాటు జస్టిస్​ రంజిత్​ వీ మోరే, జస్టిస్ సతీశ్​ చంద్ర శర్మ, జస్టిస్ ప్రకాశ్​ శ్రీవాస్తవ, జస్టిస్ ఆర్​.వి మలిమాత్​, జస్టిస్ రితు రాజ్​ అశ్వతి, జస్టిస్ అరవింద్​ కుమార్​, జస్టిస్ ప్రశాంత్​ కుమార్​ మిశ్రా పేర్లను మేఘాలయ, తెలంగాణ, కోల్​కతా, మధ్యప్రదేశ్​, కర్ణాటక, గుజరాత్​, ఆంధ్రప్రదేశ్​ హైకోర్టులకు సీజేలుగా పదోన్నతి కోసం సిఫార్సు చేసింది సర్వోన్నత న్యాయస్థానం.

ఇదీ చూడండి:- 'న్యాయవ్యవస్థలో భారతీయ స్ఫూర్తి ప్రతిబింబించాలి'

మరోవైపు జస్టిస్ ఎ.ఎ. ఖురేషీ(త్రిపుర హైకోర్టు సీజే), జస్టిస్ ఇంద్రజిత్​ మహంతి(రాజస్థాన్​ హైకోర్టు సీజే)ని రాజస్థాన్​, త్రిపుర హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది కొలీజియం. మధ్యప్రదేశ్​ సీజే జస్టిస్​ మహమ్మద్​ రఫీక్​కు హిమాచల్​ ప్రదేశ్​ హైకోర్టుకు, మేఘాలయ సీజే బిశ్వంత్​ సోమద్దర్​ను సిక్కిం హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు​ సీజే ఎ.కె. గోస్వామిని ఛత్తీస్​గఢ్​ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది.

అదే సమయంలో 17 హైకోర్టు జడ్జీలను బదిలీ చేయాలని 16న జరిగిన భేటీలో కొలీజియం నిర్ణయించింది.

5 నెలల్లో 100...!

సీజేఐగా జస్టిస్​ ఎన్​.వి. రమణ(cji ramana news) ఏప్రిల్​ నెలలో బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి న్యాయవ్యవస్థలోని అత్యుతమ స్థానాలకు నియామకాలు శరవేగంగా సాగుతున్నాయి. వివిధ హైకోర్టులకు.. ఏప్రిల్​ నుంచి ఇప్పటివరకు దాదాపు 100మంది పేర్లను సిఫార్సు చేశారు సీజేఐ. అదే సమయంలో సర్వోన్నత న్యాయస్థానంలోని తొమ్మిది ఖాళీలను ఏకకాలంలో భర్తీ చేసి చరిత్ర సృష్టించారు.

దేశంలో మొత్తం 25 హైకోర్టులు ఉన్నాయి. 2021 మే 1 నాటికి వాటిల్లో జడ్జీల సామర్థ్యం 1,080. కానీ అప్పటికి 420 మంది జడ్జీలే విధుల్లో ఉన్నారు. వచ్చే నెల నాటికి 90శాతం ఖాళీలు భర్తీ అవుతాయని సీజేఐ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:-

Last Updated : Sep 21, 2021, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.