ETV Bharat / bharat

'మెరుగైన చట్టాల రూపకల్పనకు కృషి చేస్తాం' - రైతుల సమావేశం

నూతన సాగు చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ రైతులతో సమావేశం అయ్యింది. సుమారు 8 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు.

SC-appointed panel starts consultation on agri laws; interacts with farm bodies from 8 states
'మెరుగైన చట్టాల రూపకల్పనకు కృషి చేస్తాం'
author img

By

Published : Jan 21, 2021, 5:49 PM IST

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనిడిమాండ్‌ చేస్తున్న రైతు సంఘాలతో చర్చల కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినకమిటీ.. సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది. తెలంగాణ, ఉత్తర్​ ప్రదేశ్​ సహా 8 రాష్ట్రాలకు చెందిన 10 రైతు సంఘాలతో వర్చువల్​గా భేటీ అయ్యింది.

'రైతు సంఘాల సభ్యులతో సమావేశమయ్యాం. సాగు చట్టాలపై వారి అనుకూల, వ్యతిరేక వాదనలను విన్నాం. వీటితో మెరుగైన చట్టాల రూపకల్పనకు కృషి చేస్తాం.' అని కమిటీ పేర్కొంది.

రైతులు వ్యతిరేకిస్తోన్న చట్టాల అమలును నిలిపేస్తూ సుప్రీంకోర్టు ఈ నెల 11న స్టే విధించింది. ఈ అంశంపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు నలుగురు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. సభ్యుల్లో ఒకరైన భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధ్యక్షుడు భూపీందర్‌సింగ్‌ మాన్‌ కమిటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ భేటీలో అనిల్‌ ఘన్వాత్‌తో పాటు.. డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ జోషీ, అశోక్‌ గులాటీలు మాత్రమే పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ప్యానెల్​ సభ్యులంతా వీడియో కాన్ఫిరెన్స్​ ద్వారా సమావేశం అయ్యారు.

ఇదీ చూడండి: సుప్రీంకోర్టు కమిటీపై రైతు సంఘాల పెదవివిరుపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.