కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో సుప్రీంకోర్టుకు ఒక వారం ముందుగానే వేసవి సెలవులు ఇవ్వాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కోరింది. క్యాలెండరు ప్రకారం మే 14 నుంచి జూన్ 30 వరకూ సర్వోన్నత న్యాయస్థానానికి వేసవి సెలవులు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మే 7 నుంచి సెలవులు ప్రకటించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం విజ్ఞప్తి చేశారు.
దీన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి, పూర్తి కోర్టు సమావేశం అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి- కరోనా కట్టడిలో స్వీయనియంత్రణే కీలకం