ETV Bharat / bharat

మొతేరాకు 'మోదీ స్టేడియం'గా నామకరణం - మొతేరా స్టేడియం

గుజరాత్​ మొతేరాలోని సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ మైదానానికి పేరు మార్చారు. ఇకపై నరేంద్ర మోదీ స్టేడియంగా పిలవనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అధికారికంగా ప్రకటించారు.

Sardar Patel Stadium renamed as Narendra Modi Stadium
మొతేరా స్టేడియానికి నరేంద్ర మోదీ పేరు
author img

By

Published : Feb 24, 2021, 1:36 PM IST

గుజరాత్​ మొతేరాలోని ప్రపంచంలోనే అతిపెద్దదైన సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ స్టేడియం పేరును మార్చారు. ప్రధాన మంత్రి పేరు మీదగా.. నరేంద్ర మోదీ స్టేడియంగా నామకరణం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అధికారికంగా ప్రకటించారు.

Sardar Patel Stadium renamed as Narendra Modi Stadium
మొతేరా స్టేడియం

ఈ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ప్రారంభించారు. అంతకు ముందు సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ ఎన్​క్లేవ్​ నిర్మాణానికి భూమి పూజ చేశారు రాష్ట్రపతి దంపతులు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, క్రీడల శాఖ మంత్రి కిరణ్​ రిజిజు, గుజరాత్​ ఉప ముఖ్యమంత్రి నితీశ్​ పటేల్​ హాజరయ్యారు.

ప్రపంచంలోనే పెద్ద స్టేడియంగా రికార్డు

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా మొతేరా స్టేడియం రికార్డులకెక్కింది. లక్షా పదివేల సీటింగ్‌ సామర్థ్యంతో స్టేడియాన్ని పునర్​ నిర్మించారు.

ఇదీ చూడండి: మొతేరా స్టేడియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.