ETV Bharat / bharat

Delhi Liquor Scam: ఎత్తుగడలో భాగమా..! అత్యున్నతస్థాయి వ్యక్తుల ప్రోద్బలంతో శరత్‌రెడ్డి అప్రూవర్‌గా మారినట్లు ప్రచారం! - updates in delhi liquor scam

Delhi Liquor Scam Updates: దిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఈ కేసులో ఏ-7గా ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్‌ పెనక శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారేందుకు అనుమతించాలంటూ చేసిన అభ్యర్థనను.. రౌజ్‌ అవెన్యూలోని సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఆమోదించి క్షమాభిక్ష ప్రసాదించింది. ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, వారి పాత్రలేంటి, నేరం జరిగిన విధానం వంటి అంశాలపై ఆయన దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇవ్వనున్నారు. దాని ఆధారంగా భవిష్యత్తులో కీలక పరిణామాలు చోటుచేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Delhi Liquor Scam Updates
Delhi Liquor Scam Updates
author img

By

Published : Jun 2, 2023, 8:42 AM IST

Sarath Chandra Reddy In Delhi Liquor Scam: దిల్లీ మద్యం కేసులో అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడం చర్చనీయాంశంగా మారింది. శరత్‌ చంద్రారెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ్, బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవితలు సౌత్‌గ్రూప్‌ను తెరవెనుక ఉండి నడిపించారని.. ఆప్‌ నేతలకు 100 కోట్ల రూపాయల ముడుపులిచ్చి, మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారు చేయించుకున్నారన్నది ప్రధాన అభియోగం. ఇందులో పెద్ద ఎత్తున మనీల్యాండరింగ్‌ జరిగిందని ఆరోపిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

మద్యం కుంభకోణంలో శరత్‌ కీలక వ్యక్తి అని ఈడీ ఇదివరకు దాఖలు చేసిన రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. దిల్లీ మద్యం విధానం ప్రకారం ఏ వ్యక్తీ రెండు రిటైల్‌ జోన్లకు మించి నియంత్రించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా శరత్‌చంద్రారెడ్డి తన సొంత, బినామీ సంస్థల ద్వారా తొమ్మిది రిటైల్‌ జోన్లను నియంత్రిస్తున్నారని.. తయారీదారులు, టోకు, చిల్లర వ్యాపారులతో కలిపి సౌత్‌గ్రూప్‌ పేరుతో ఏర్పాటైన అతిపెద్ద సిండికేట్‌లో శరత్‌చంద్రారెడ్డి ప్రధాన భాగస్వామి అని ఈడీ పేర్కొంది.

తాజా నిర్ణయంతో శరత్‌చంద్రారెడ్డిని ఇకపై నిందితుడిగా కాకుండా సాక్షిగా లేకుంటే అప్రూవర్‌గా చూపుతారు. ప్రాసిక్యూషన్‌ సమయంలో మిగతా నిందితులకు వ్యతిరేకంగా శరత్‌చంద్రారెడ్డి సాక్ష్యం చెప్పే వీలు ఉంటుంది. దిల్లీ మద్యం కేసులో వివిధ రాజకీయపార్టీలకు చెందిన పెద్ద నేతల ప్రమేయాన్ని బలంగా నిరూపించడానికే అత్యున్నతస్థాయి వ్యక్తుల ప్రోద్బలంతో శరత్‌రెడ్డి అప్రూవర్‌గా మారినట్లు కథనాలు వినిపిస్తున్నాయి.

నేరంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాల్గొన్న వారు అప్రూవర్‌గా మారినప్పుడు సీఆర్‌పీసీ సెక్షన్‌ 306 కింద చట్టపరంగా క్షమాభిక్ష ప్రసాదిస్తారు. ఇందుకు ప్రతిఫలంగా ఆ వ్యక్తి.. నేరం జరిగిన తీరు, అందులో వ్యక్తుల ప్రమేయం, అందుకు సాక్ష్యాలు, ఇతర అంశాలను దర్యాప్తు సంస్థలకు అందించి సహకరించాల్సి ఉంటుంది. దర్యాప్తు, విచారణ ఏ దశలో ఉన్నప్పుడైనా క్షమాభిక్ష ప్రసాదించొచ్చు. నేరానికి సంబంధించి సంపూర్ణమైన వాస్తవాలు వెల్లడించాలన్న షరతుతోనే కోర్టు అప్రూవర్లకు క్షమాభిక్ష ప్రసాదిస్తుంది.

2022 నవంబరు 10వ తేదీ అర్ధరాత్రి 12.20 గంటలకు శరత్‌రెడ్డిని ఈడీ అరెస్టు చేసింది. మే 8న దిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. అంతకుముందు జనవరి 27న ఆయన నాయనమ్మ అంత్యక్రియల కోసం 14 రోజులపాటు మధ్యంతర బెయిల్‌ పొందారు. తర్వాత భార్య అనారోగ్యం కారణంగా ఏప్రిల్‌ 1న కోర్టు నాలుగు వారాల బెయిల్‌ ఇచ్చింది. తర్వాత తనకు అనారోగ్య సమస్యలున్నాయంటూ అపోలో ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా శరత్‌ దిల్లీ హైకోర్టులో దరఖాస్తు చేసుకుని.. పూర్తిస్థాయి బెయిల్‌ పొందారు.

దిల్లీ మాజీ మంత్రి సత్యేంద్రజైన్‌ అనారోగ్య సమస్యలపై బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు దిల్లీలోని ప్రభుత్వాసుపత్రులు ఇచ్చిన ధ్రువీకరణపత్రాలపై తమకు అనుమానం ఉందని, అందువల్ల ఎయిమ్స్‌లో పరీక్షలు చేయించి.. నిర్ణయం తీసుకోవాలని ఈడీ న్యాయవాదులు వాదించారు. కానీ అంతకుముందు దిల్లీ హైకోర్టులో శరత్‌రెడ్డి బెయిల్‌ విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించారు. అనారోగ్య కారణాల వల్ల నిందితులకు బెయిల్‌ ఇవ్వడం సాధారణమేనని, కోర్టు సంతృప్తి చెందితే తగిన ఉత్తర్వులు జారీచేయొచ్చని చెప్పారు. ఆయన మధ్యంతర బెయిల్‌పై ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేయలేదని, సాక్ష్యాలను చెరిపేసేందుకూ ప్రయత్నించలేదని కూడా సమర్థించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.