ETV Bharat / bharat

ఇంట్లోనే కుంకుమ పువ్వు సాగు- కృత్రిమంగా కశ్మీర్ వాతావరణం, ఎలాగో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2023, 10:50 AM IST

Saffron Cultivation In Karnataka : కశ్మీర్​లో పండించే కుంకుమ పువ్వును తన ఇంట్లోనే పండిస్తున్నాడు కర్ణాటకకు చెందిన ఓ యువకుడు. ఇంట్లోనే కశ్మీర్​ వాతావరణాన్ని సృష్టించి కుంకుమ పువ్వును సాగు చేస్తున్నాడు. అలా ఎలా చేశాడు? అందుకు ఎంత ఖర్చు అయింది? సాగు ఏ విధంగా చేస్తున్నాడు? అనే విషయాలు తెలుసుకుందాం.

Saffron Cultivation In Karnataka
Saffron Cultivation In Karnataka
ఇంట్లోనే కుంకుమ పువ్వు సాగు- కృత్రిమంగా కశ్మీర్ వాతావరణం

Saffron Cultivation In Karnataka : కశ్మీర్​కే పరిమితమైన కుంకుమ పువ్వును.. ఇప్పుడు కర్ణాటకలోనూ పండిస్తున్నాడు ఓ యువకుడు. ఇంట్లోనే కశ్మీర్ వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి మరీ.. కుంకుమ పువ్వును పెంచుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అలానే మంచి దిగుబడిని సాధించాడు. అతడే దావణగెరెలోని దూడ్డబాతి ప్రాంతానికి చెందిన జాకబ్ సత్యరాజ్.

"నేను కొత్తగా ఏదైనా చేయాలని అనుకున్నాను. అప్పుడే కుంకుమ పువ్వు సాగు చేయాలని ఆలోచన వచ్చింది. అందుకోసం ఆంధ్రప్రదేశ్​లో ఇంతకముందు పండించిన వారి దగ్గరకు వెళ్లి సమాచారాన్ని సేకరించాను. తర్వాత ఉర్దూ మాట్లాడే నా స్నేహితులను కశ్మీర్​కు తీసుకెళ్లి అక్కడ కొద్ది రోజుల ఉండి కుంకుమ పువ్వును ఎలా పండించాలో నేర్చుకున్నాను. " అని జాకబ్ సత్యరాజ్ తెలిపాడు.

Saffron Cultivation In Karnataka
పండించిన కుంకుమ పువ్వులతో జాకబ్

కుంకుమ పువ్వును సాగు చేయడం కోసం 60 కిలోల విత్తనాలను కశ్మీర్​ నుంచి కొనుగోలు చేశాడు జాకబ్. తీసుకొచ్చేటప్పుడే 15 కిలోల విత్తనాలు పాడైపోగా.. మిగిలిన వాటితో సాగు చేశాడు. కుంకుమ పువ్వు సాగు కోసం తన ఇంటిలోనే ఓ గదిలో తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉండేలా ఏసీ పెట్టాడు. గదిలోని చలి బయటకుపోకుండా ఉండటానికి థర్మల్ సీల్​తో కవర్ చేశాడు. సేంద్రియ ఎరువును, కుంకుమ పువ్వుకు అనూకూలంగా ఉండే మట్టిని తెచ్చి సాగు చేస్తున్నాడు.

Saffron Cultivation In Karnataka
కుంకుమ పువ్వు కోసం సెట్​ చేసిన రూం టెంపరేచర్

విత్తనాలను ఒక ట్రేలో వేసి.. మొలకలు రావటానికి కావల్సిన టెంపరేచర్​ను రూంలో ఏర్పాటు చేశాడు జాకబ్. మొలకలు వచ్చాక వాటిని తీసి మట్టిలో వేశాడు. కుంకుమ పువ్వు రావడం కోసం వాటికి కావల్సిన ఉష్ణోగ్రతలను సెట్​ చేసి పెట్టాడు. పువ్వులు వికసించాక వాటి నుంచి కుంకుమను వేరు చేస్తున్నాడు జాకబ్. అలానే విత్తనాలను కూడా ఉత్పత్తి చేస్తున్నాడు.

Saffron Cultivation In Karnataka
కుంకుమ పువ్వును సాగు చేస్తున్న జాకబ్

"ఇప్పటివరకు ఈ పంట కోసం మొత్తం 3 నుంచి 4 లక్షల వరకు ఖర్చు చేశాను. ప్రస్తుతానికి 20 గ్రాముల కుంకుమపువ్వును పండించాం. కుంకుమ పువ్వు మార్కెట్​లో మంచి ధరనే ఉంది. నేను పండించిన కుంకుమ పువ్వును అమ్మాలి. ఈ పంటను సాగు చేస్తున్నందుకు ఆనందంగా ఉంది." -జాకబ్ సత్యరాజ్

ఇంట్లోనే కుంకుమను సాగు చేస్తున్నందుకు ఆనందంగా ఉందని జాకబ్​ తల్లి తెలిపారు. కశ్మీర్​ నుంచి తెచ్చిన విత్తనాలతో మరిన్ని సీడ్స్ ఉత్పత్తి చేసి.. మరింత ఎక్కవగా కుంకుమ పువ్వును సాగు చేయాలని అనుకుంటున్నాడు జాకబ్.

Saffron Cultivation In Karnataka
కుంకుమ పువ్వు సాగు
Saffron Cultivation In Karnataka
కుంకుమ పువ్వు

మన దగ్గర కూడా కుంకుమ పువ్వు సాగు- రూ.లక్షల్లో లాభాలు- ఎలాగంటే?

కశ్మీరీ కుంకుమ పువ్వు.. కంటెయినర్లలో సాగు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.