కరోనాపై భాజపా ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పదంగా మాట్లాడారు. గో మూత్రం తాగడం, దేవుడ్ని హృదయపూర్వకంగా ఆరాధించడం వల్ల తనకు ఎప్పటికీ కరోనా సోకబోదని అన్నారు. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడింది. కరోనా సంక్షోభ సమయంలో ఆమె కనిపించకుండా పోయారని విమర్శించింది.
కరోనాపై వివాదాస్పదంగా మాట్లాడటం ప్రగ్యాకు ఇది కొత్తేం కాదు. వైరస్ మొదటి దశలో కూడా.. ప్రతి ఒక్కరు ఆవును పెంచుకోవడం, హనుమాన్ చాలీసా చదవడం వల్ల కరోనాను అరికట్టవచ్చని అన్నారు. అయితే.. ప్రగ్యా కార్యాలయంలో అందరికి కరోనా సోకినా.. ఆమె మాత్రం వైరస్ బారిన పడలేదు.
ఇదీ చదవండి: 'భారత్లో టీకా తర్వాత రక్తస్రావం కేసులు తక్కువే!'