Sachin Pilot Sara Abdullah Divorced : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్.. తన ఎన్నికల అఫిడవిట్‌లో సంచలన విషయాన్ని బయటపెట్టారు. మంగళవారం టోంక్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసిన ఆయన.. ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పౌజ్ అనే ఆప్షన్ వద్ద డివోర్స్ అని పేర్కొన్నారు. దీనిని చూసిన వారంతా షాక్‌కు గురవుతున్నారు.
Sachin Pilot Wife Divorced : సచిన్ పైలట్ 2004లో సారా అబ్దుల్లాను వివాహం చేసుకున్నారు. సారా జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కుమార్తె కావడం వల్ల అప్పట్లో వీరి వివాహం ఓ హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ పెన్సిల్వేనియా యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో ప్రేమలో పడ్డారు. కాగా, వీరికి ఇద్దరు కుమారులు అరాన్, విహాన్ ఉన్నారు. ప్రస్తుతానికి కుమారులిద్దరూ తనపై ఆధారపడి ఉన్నారని పైలట్ తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అయితే, ఎప్పుడు విడాకులు తీసుకున్నారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
అయితే, సచిన్, సారా విడిపోయినట్లు 9 ఏళ్ల కిందటే వార్తలు వచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అలాంటి వార్తలు జోరుగా ప్రచారం కావడం వల్ల వాటిని ఖండించారు. ఆ తరువాత 2018లో జరిగిన ఎన్నికల అఫిడవిట్‌లో తన భార్యగా సారాను పేర్కొన్నారు. డిసెంబరులో సచిన్ పైలట్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమానికి ఫరూక్ అబ్దులా, సారా, విహాన్, అరాన్‌లు హాజరయ్యారు. తాజాగా అఫిడవిట్ వెలుగులోకి రావడంతో మరోసారి సచిన్ పైలట్ దంపతుల విడాకుల గురించి నెట్టింట చర్చ జరుగుతోంది.
సచిన్ ఆస్తులెంతో తెలుసా?
Sachin Pilot Income : ఇక సచిన్ పైలట్ ఆస్తులు గత ఐదేళ్లలో రెట్టింపు అయ్యాయి. 2018 ఆయన మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 3.8 కోట్లు కాగా.. తాజా అఫిడవిట్‌లో తన ఆస్తులను రూ.7.5 కోట్లుగా చూపించారు. నామినేషన్కుముందు తన మద్దతుదారులతో భారీ ర్యాలీ నిర్వహించారు సచిన్ పైలట్. బడాకౌన్ నుంచి పటేల్ చౌక్ వరకు ర్యాలీగా వచ్చి నామినేషన్ సమర్పించారు. అంతకుముందు భూతేశ్వర్ మహాదేవ్ ఆలయంలో పూజలు చేశారు. 200 స్థానాలున్న రాజస్థాన్‌లో నవంబరు 25న పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న ఫలితాలు వెలువడనున్నాయి.
రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఐక్యరాగం.. గహ్లోత్ X పైలట్ రాజీ కుదిరిందా?