కొవిడ్-19 మొదటి ఉద్ధృతి తర్వాత దేశంలోని అన్ని వర్గాల్లోనూ నిర్లక్ష్యం పెరిగిపోయిందని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ శనివారం పేర్కొన్నారు. అదే ప్రస్తుత పరిస్థితికి కారణమైందన్నారు.
"మొదటి విజృంభణ తర్వాత మనలో నిర్లక్ష్యం పెరిగిపోయింది. ప్రజలు, ప్రభుత్వాలు, పాలనా యంత్రాంగం.. ఇలా అందరిలోనూ అదే ధోరణి. రెండో ఉద్ధృతి వస్తుందని మనకు తెలుసు. వైద్యులూ హెచ్చరించారు. అయినా మన పద్ధతి మారలేదు".
-- మోహన్‌భగవత్, ఆర్ఎస్ఎస్ అధినేత
అయితే సంక్షోభ సమయంలో పరస్పరం నిందించుకోవడానికి బదులు అందరూ ఐక్యంగా పనిచేయాలని మోహన్‌భగవత్ సూచించారు. కరోనాపై పోరులో ప్రజలు సానుకూల ధోరణితో, చురుగ్గా ఉండాలని కోరారు. కొవిడ్ 'నెగిటివ్'గా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. 'పాజిటివిటీ అన్‌లిమిటెడ్'పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
మరోవైపు కొవిడ్‌పై పోరు అంశంలో ప్రభుత్వం మరింత పారదర్శకంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత, భాజపా మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సూచించారు.
ఇదీ చదవండి : ఆపత్కాలంలోనూ రాజకీయాలేనా.. విచక్షణ ఏది?