Rohini Court Blast: దిల్లీ రోహిణీ కోర్టులో మరోసారి పేలుడు కలకలం సృష్టించింది. కోర్టు రూం 102లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి కాలికి గాయమైనట్లు పోలీసులు వెల్లడించారు.
ఘటనాస్థలిని పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. ఫోరెన్సిక్, ఎన్ఎస్జీ బృందాలు.. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు దిల్లీ పోలీస్ పీఆర్ఓ వెల్లడించారు. లాప్టాప్ బ్యాగులో ఉన్న వస్తువే పేలుడుకు కారణమని అనుమానిస్తున్నట్లు ఆయన చెప్పారు.
పేలుడు నేపథ్యంలో కోర్టు కార్యకలాపాలను నిలిపివేశారు. ఉదయం 10.40 గంటలకు సమాచారం అందగా.. హుటాహుటిన ఏడు అగ్నిమాపక యంత్రాలు కోర్టుకు చేరుకున్నాయి.
Rohini Court Explosion: ఈ ఘటనపై దిల్లీ ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు చేపట్టింది.
కాల్పుల ఘటన తర్వాత..
దిల్లీ రోహిణీ కోర్టు ప్రాంగణంలో కాల్పుల ఘటన జరిగిన రెండు నెలలకు ఇప్పుడు ఇలా జరగడం చర్చనీయాంశమైంది.
సెప్టెంబర్ 24న కోర్టుకు తీసుకెళ్తున్న క్రమంలో గ్యాంగ్స్టర్ జితేంద్ర అలియాస్ గోగీని.. గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు హతమయ్యారు. ఈ ఘటన అప్పుడు సంచలనం సృష్టించింది.
ఇదీ చూడండి:- పట్టపగలే కోర్టులో కాల్పులు.. ముగ్గురు మృతి