robbery in Devagiri express: రైలు సిగ్నల్ బోర్డుకు వస్త్రాలను కట్టి, ట్రైన్ ఆగేలా చేసింది ఓ దొంగల ముఠా. వెంటనే దుండగులు రైలు బోగీలపై రాళ్ల దాడి చేశారు. దేవగిరి ఎక్స్‌ప్రెస్ కోచ్‌లలోకి ప్రవేశించి ప్రయాణికుల దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు, పర్సులు, మహిళా ప్రయాణికుల ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పొతూల్ రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం రాత్రి జరిగింది.
అసలేం జరిగిందంటే..: 10మంది దుండగులు గుంపుగా వచ్చి ఈ దొంగతనాలకు పాల్పడ్డారు. ఇందుకోసం అంబులెన్స్‌ను వాహనంగా వాడారు. దేవగిరి ఎక్స్‌ప్రెస్ పొతూల్ రైల్పే స్టేషన్ సమీపానికి వచ్చేసరికి సిగ్నల్ ఆగేలా చేశారు. దీంతో రైలు డ్రైవరు ట్రైన్‌ను ఆపి.. స్టేషన్ మాస్టర్‌కు ఫోన్ చేశాడు. ఇంతలో రాళ్లతో దాడి చేసుకుంటూ దొంగలముఠా రైలు కోచ్‌లలోకి ప్రవేశించింది. దీంతో ప్రయాణికులు భయంతో అరుపులు మొదలుపెట్టారు. మొత్తం అర గంటలోనే ఈ చోరీ అంతా జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దౌలతాబాద్, ఔరంగాబాద్, లాసుర్ పట్టణాల్లో దొంగల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఇదీ చదవండి: ఉగ్రదాడిలో జవాను వీరమరణం.. ఎన్కౌంటర్లో ఆరుగురు తీవ్రవాదులు హతం