ETV Bharat / bharat

అర్ధరాత్రి హైవేపై సినీఫక్కీలో రూ.కోటి చోరీ - కేరళ కన్నూరుకి చెందిన సూరజ్​

బంగారం వ్యాపారి నుంచి కోటి రూపాయలను సినీఫక్కీలో దోచుకెళ్లారు కొందరు దుండగులు. హైవేమీద కారును అడ్డగించి వ్యాపారిని బెదిరించి ఈ చోరీకి పాల్పడ్డారు. కేరళ-కర్ణాటక రహదారిపై జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Robbers looted 1 crore Rupees from Kerala gold businessman
రూ.కోటి విలువైన బంగారం.. సినీఫక్కీలో మాయం..
author img

By

Published : Mar 19, 2021, 6:10 PM IST

కేరళ-కర్ణాటక జాతీయ రహదారిపై సినీఫక్కీలో జరిగిన చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి వేళ హైవేపై ప్రయాణిస్తున్న కేరళకు చెందిన వ్యాపారి వద్ద నుంచి కోటి రూపాయలు దోచుకెళ్లారు దొంగలు.

బంగారం వ్యాపారి..

కేరళకు చెందిన సూరజ్​ బంగారం దుకాణం నడుపుతున్నారు. ఈ నెల 15న బంగారం విక్రయించేందుకు బెంగళూరు వచ్చి అదేరోజు రాత్రి రూ.కోటి నగదుతో కేరళకు బయలుదేరాడు. అర్ధరాత్రి సమయంలో జాతీయ రహదారిపై డ్రైవర్​తో పాటు ప్రయాణిస్తున్న అతను యశోదరాపురం వద్ద మూత్రవిసర్జన కోసం ఆగాడు. ఈ సమయంలో రెండు ఇన్నోవా కార్లలో వచ్చిన ఏడుగురు వ్యక్తులు బంగారం వ్యాపారిని, అతని కారు డ్రైవర్​ను చితకబాది రూ.కోటి నగదుతో పరారయ్యారు. సెల్​ఫోన్లనూ ఎత్తుకెళ్లారు. హునసూరు గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గాయాలతో బయటపడ్డ సూరజ్​, అతని డ్రైవర్​ స్థానికుల సహాయంతో పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చిసన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇదీ చదవండి: రూ.60 కోట్లు విలువ చేసే హెరాయిన్ పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.