Road Accident In Maharashtra: మహారాష్ట్రలోని జలగావ్లో విషాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన ఓకారు ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో కారులోని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
కారు ఎర్నాదోల్ నుంచి జలగావ్ ప్రయాణిస్తుండగా పింపలకోటా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కును బలంగా ఢీకొనడం వల్ల కారు నుజ్జునుజ్జు అయినట్లు పోలీసులు తెలిపారు.
మృతదేహాలను క్రేన్ సాయంతో బయటకు తీశామన్నారు. గాయపడిన వ్యక్తిని జలగావ్‌లోని ప్రభుత్వఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కూతుర్ని చంపి.. ఆ మృతదేహంపైనే తండ్రి అత్యాచారం