ETV Bharat / bharat

నీటి గుంతలో పడిన స్కార్పియో.. 8 మంది దుర్మరణం

पूर्णिया में एक तेज रफ्तार स्कॉर्पियो के गड्ढे में पलट (Scorpio Overturned In Purnea) जाने से 8 लोगों की मौत हो गई. सभी लोग किशनगंज के नुनिया गांव के रहने वाले थे. फिलहाल पुलिस मौके पर पहुंचकर मामले की तफ्तीश में जुटी है.

Road accident in Bihar purnea many people died

author img

By

Published : Jun 11, 2022, 8:16 AM IST

Updated : Jun 11, 2022, 11:33 AM IST

నీటి గుంతలో పడిన స్కార్పియో.. 8 మంది దుర్మరణం

08:08 June 11

Purnea Accident: బిహార్​ పూర్ణియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ స్కార్పియో.. నీళ్లతో నిండి ఉన్న గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది అక్కడిక్కడే చనిపోయారు. మరో ఇద్దరు ప్రాణాలు కాపాడుకున్నారు. రౌటా పోలీస్​స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది. మృతుల్ని కిశన్​గంజ్​లోని నునియా గ్రామస్థులుగా గుర్తించారు. తారాబడి ప్రాంతంలో జరిగిన ఓ ముందస్తు వివాహ కార్యక్రమానికి హాజరైన బాధితులు.. తిరిగి ప్రయాణమవుతుండగా శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం?.. భారీ శబ్దం విన్న స్థానికులు ప్రమాదస్థలికి చేరుకుని కారులో ఉన్న మృతదేహాల్ని బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, సీఓ ఘటనా స్థలానికి చేరుకుని పూర్తి సమాచారం సేకరించారు. మృతుల బంధువులు సైతం ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. వాహనం అతివేగంగా నడపడం, డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

ఇవీ చదవండి: కోడికూర వండలేదని.. భార్యను నరికి చంపిన భర్త

మండుటెండలో చెట్టు నుంచి వర్షం.. అమ్మవారి మహిమే కారణమా?

Last Updated : Jun 11, 2022, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.