త్వరలో జరగనున్న అసోం శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా మొట్టమొదటిసారి గువాహటిలో పర్యటించారు.
భావసారూప్యత కలిగిన పార్టీలతో కలసి పనిచేయనున్నట్లు వెల్లడించిన ఆర్జేడీ నేత.. ఇప్పటికే కాంగ్రెస్తో చర్చించామని తెలిపారు. ఏఐయూడీఎఫ్నూ సంప్రదించి సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
తమకు గెలుపు అవకాశాలు ఉన్న చోట కచ్చితంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
''భావసారూప్యత కలిగిన పార్టీలతో కలసి భాగస్వామ్య కూటమిని ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్ సహా ఇతర చిన్న పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం.''
-తేజస్వీ యాదవ్, ఆర్జేడీ నేత.
త్వరలో ఎన్నికలు జరగనున్న బంగాల్, కేరళ, పుదుచ్చేరిలలోనూ భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నట్టు తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సీట్ల సర్దుబాటపై భాజపా, అన్నాడీఎంకే భేటీ