ETV Bharat / bharat

ట్విట్టర్​ పోల్​లో జడేజా భార్యకు ఊహించని షాక్​.. ఆ పోస్ట్​ తొలగింపు

క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు సోషల్​మీడియాలో ఊహించని షాక్ తగిలింది. గుజరాత్​ అసెంబ్లీలో విజయం ఎవరిది, దేశ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అంటూ ఆమె నిర్వహించిన ట్విట్టర్​​ పోల్​కు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దీంతో ఆమె తమ పోస్ట్​ను తొలగించింది. ​

Rivaba jadeja removed the tweet
రివాబా జడేజా ట్విటర్​ పోల్
author img

By

Published : Nov 17, 2022, 9:39 PM IST

Updated : Nov 17, 2022, 10:00 PM IST

క్రికెటర్​ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు సోషల్​మీడియాలో ఊహించని సంఘటన ఎదురైంది. ఆమె నిర్వహించిన ట్విట్టర్ పోల్​కు వచ్చిన ఫలితాలను చూసి కంగుతిన్నారు. "గుజరాత్​ అసెంబ్లీలో విజయం ఎవరిది" అని ఆమె ట్విటర్​ పోల్​ నిర్వహించగా ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయి. దీంతో ఆమె ఆ పోస్ట్​ను తొలగించింది. "దేశ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు" అన్న పోస్ట్​కు సైతం ఆమెకు ఊహించినట్లుగా స్పందన రాలేదు.

కాగా, క్రికేటర్​ జడేజా భార్య రివాబా జడేజా భాజాపాలో చేరిన విషయం తెలిసిందే. ఆమె గుజరాత్​లోని జామ్​​నగర్ నార్త్​ నుంచి పోటి చేస్తున్నారు. ​గుజరాత్​ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ ఏర్పాటుపై సోషల్​ మీడియా వేదికగా చాలా సర్వేలు జరుగుతున్నాయి. అయితే రివాబా జడేజా కూడా "గుజరాత్​ అసెంబ్లీలో విజయం ఎవరిది" అంటూ ట్విటర్​లో ఒపినియన్​ పోల్ నిర్వహించారు. అయితే ఫలితాలు మాత్రం ఆమె ఊహించినట్లుగా రాలేదు. ఈ పోల్​లో 63 శాతం మంది ఆప్​కు మద్దతు ఇవ్వగా, 25 శాతం భాజాపాకు మద్దతిచ్చారు. మరో 10 శాతం మంది కాంగ్రేస్​కు మద్దతు తెలిపారు.

"దేశ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు" అంటూ ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, అరవింద్​ కేజ్రీవాల్​ పేర్లను జత చేసిన మరో పోస్టుకు ప్రతికూల ఫలితాలే వచ్చాయి. అరవింద్​ కేజ్రీవాల్​కు 68 శాతం ఓటు వేయగా, నరేంద్ర మోదీకి 22 శాతం మంది మద్దతు ఇచ్చారు. రాహుల్ గాంధీకి 10 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.

Rivaba jadeja removed the tweet
రివాబా, జడేజా భార్య

Last Updated : Nov 17, 2022, 10:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.