ETV Bharat / bharat

కేసులు తగ్గుముఖం.. 3 లక్షలు దాటిన మరణాలు - corona casesin india

దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. ఆయా రాష్ట్రాల్లో విధించిన కఠిన ఆంక్షలతో పరిస్థితి అదుపులోకి వస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. తమిళనాడులో కొత్తగా 35,483మందికి వైరస్ నిర్ధరణ కాగా.. మహారాష్ట్రలో 26,672 కేసులు వెలుగుచూశాయి. ఇక బ్రెజిల్, అమెరికాల తర్వాత భారత్​లో కరోనా మరణాలు 3 లక్షలు దాటాయి.

India cases
కొవిడ్ ఉద్ధృతి
author img

By

Published : May 23, 2021, 10:12 PM IST

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మరణాలు.. 3 లక్షలు దాటాయి. ఈ జాబితాలో అమెరికా, బ్రెజిల్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

తమిళనాడులో ఒక్కరోజులో 35,483 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరో 422 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 17 లక్షలకు చేరింది.

వివిధ రాష్ట్రాల్లో కేసులు, మరణాల వివరాలు..

  • మహారాష్ట్రలో 26,672 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. మరో 594 మంది మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
  • కేరళలో తాజాగా 25,820 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 188 మంది చనిపోయారు.
  • కర్ణాటకలో ఒక్కరోజే 25,979 మందికి వైరస్ సోకగా.. మరో 626 మంది మృతి చెందారు.
  • బంగాల్​లో మరో 18,422 మంది పాజిటివ్​గా తేలగా.. మరో 156 మంది ప్రాణాలు కోల్పోయారు.

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్​తో ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు నిపుణులు విశ్లేషించారు. ఈ నేపథ్యంలోనే మహమ్మారి నివారణకు పలు రాష్ట్రాలు లాక్​డౌన్​, కర్ఫ్యూలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

  • గోవాలో ఈ నెల 31 వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
  • రాజస్థాన్ ప్రభుత్వం 15 రోజుల పాటు(జూన్ 8 వరకు) లాక్​డౌన్​ను పొడిగించింది.
  • దేశ రాజధానిలో మరో వారం పాటు లాక్​డౌన్ కొనసాగుతుందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
  • హరియాణాలో మే 31 వరకు లాక్​డౌన్​ను పొడిగించింది ప్రభుత్వం.
  • పుదుచ్చేరిలో మే 31వరకు ఆంక్షలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇవీ చదవండి: 21 రోజుల్లో 341 మంది పిల్లలకు కరోనా

గంగానది ఒడ్డున ఇసుకలో భారీగా మృతదేహాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.