ETV Bharat / bharat

రోటీ ఇవ్వలేదని రిక్షావాలా హత్య.. ఆరు గంటల్లోనే... - రోటీ రిక్షావాలా

Rickshaw Puller Murdered: రోటీ అడిగితే ఇవ్వలేదని రిక్షావాలాను కత్తితో పొడిచాడు ఓ వ్యక్తి. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ బాధితుడు ఆసుపత్రిలో మరణించాడు. ఈ దారుణ ఘటన దిల్లీలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆరు గంటల్లోనే నిందితుడ్ని అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించారు.

RickShaw Puller Murdered For RotiRickShaw Puller Murdered For Roti
RickShaw Puller Murdered For Roti
author img

By

Published : Jul 28, 2022, 1:23 PM IST

Rickshaw Puller Murdered For Roti: దిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. రోటీ అడిగితే ఇవ్వలేదని రిక్షావాలాను.. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి కత్తితో దారుణంగా పొడిచాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్​ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. కరోల్​బాగ్​ ప్రాంతంలో మంగళవారం రాత్రి.. మున్నా అనే రిక్షా నడుపుకునే ఓ వ్యక్తి స్థానిక హోటల్​లో రోటీలు కొనుక్కున్నాడు. అనంతరం రోడ్డు పక్కన కూర్చొని తింటున్నాడు. అదే సమయంలో మద్యం మత్తులో వచ్చిన నిందితుడు ఫిరోజ్​ ఖాన్​.. మున్నాను ఓ రోటీ ఇవ్వమని అడిగితే ఇచ్చాడు. ఆ తర్వాత మరో రోటీ అడిగాడు నిందితుడు. అందుకు మున్నా నిరాకరించాడు. దీంతో వెంటనే కత్తి తీసి బాధితుడ్ని పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు ఫిరోజ్​.

అపస్మారక స్థితిలో పడి ఉన్న రిక్షావాలా మున్నాను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. రంగంలోకి దిగారు. నిందితుడి కోసం పలుచోట్ల గాలింపు చేపట్టారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న పార్క్​లో నిందితుడు నిద్రిస్తున్నట్లు తెలిసి అక్కడికి వెళ్లారు. వివిధ కోణాల్లో పోలీసులు విచారించగా.. ఫిరోజ్​ నేరాన్ని ఒప్పుకున్నాడు. అతడ్ని అరెస్ట్​ చేసిన పోలీసులు.. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన ఆరు గంటల్లోనే కేసును చేధించారు. నిందితుడు ఫిరోజ్​ ఖాన్​ ఉత్తర్​ప్రదేశ్​కు చెందినవాడని, మద్యానికి బానిసయ్యాడని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి: 11 ఏళ్ల బాలికపై గ్యాంగ్​రేప్.. నాలుగేళ్ల చిన్నారిపై 69 ఏళ్ల వృద్ధుడు!

కుక్కను మింగేసిన 13 అడుగుల పైథాన్​.. ఏనుగు హల్​చల్​..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.