Revanth Reddy Sworn in as Telangana Chief Minister : హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సహా 12 మంది మంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ (Sonia Gandhi), రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, కేసీ వేణుగోపాల్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు సిద్ధరామయ్య, సుఖ్విందర్‌సింగ్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే. శివకుమార్ (DK Shivakumar), కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర నేతలు, వివిధ పార్టీల నాయకులు, వేలాదిగా జనం తరలివచ్చారు. పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలతో ఎల్బీ స్టేడియం పరిసరాలు కిటకిటలాడాయి. స్టేడియం ఎనిమిదో గేట్ నుంచి సోనియాగాంధీ, రేవంత్‌రెడ్డి ప్రత్యేక వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ వేదిక వద్దకు వచ్చారు.
రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం వేళ ఎల్బీ స్టేడియానికి పోటెత్తిన జనం - డ్రోన్ విజువల్స్ చూశారా?
వేదికపై అతిరథమహారథులు ఆశీనులు కాగా తర్వాత స్టేడియానికి వచ్చిన గవర్నర్ తమిళిసైసౌందర్‌రాజన్‌కు (Governor Tamilisai) రేవంత్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. జాతీయ గీతాలాపన అనంతరం, గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్ దైవసాక్షిగా ప్రమాణం చేశారు.
వెన్నుచూపని వీరుడు, జనాదరణ పొందిన నాయకుడు - తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Telangana New Chief Minister Revanth Reddy Sworn : ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం అనంతరం ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత మంత్రులుగా ఉత్తమ్, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావులతో గవర్నర్ ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ దైవసాక్షిగా ప్రమాణం చేయగా సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పవిత్ర హృదయంతో అంటూ ప్రమాణస్వీకారం చేశారు. దామోదర రాజనర్సింహ ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు.
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణం - ఆరు గ్యారంటీల దస్త్రంపై తొలి సంతకం
రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం అనంతరం. ముఖ్యమంత్రి దంపతులు సోనియాగాంధీ, మల్లికార్జునఖర్గే ఆశీస్సులు తీసుకున్నారు. ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు కాంగ్రెస్ అగ్రనేతలు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్యనేతలు, కార్యకర్తలతో పాటు వేలాదిగా తరలొచ్చిన జనంతో ఎల్బీస్టేడియం పరిసరాలు కిటకిటలాడాయి. ప్రత్యక్షంగా వీక్షించలేని వారికి స్టేడియం బయట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.
ప్రమాణస్వీకారం చేయలేదని అధికార కాన్వాయ్‌కు నో చెప్పిన రేవంత్
రేవంత్ రెడ్డి సీఎం కానుండటంతో సచివాలయ ఉద్యోగుల సంబురాలు - పాల్గొన్న కోదండరాం