ETV Bharat / bharat

384 మందికి గ్యాలంటరీ అవార్డులు.. రాష్ట్రపతి ఆమోదం

Republic Day 2022: గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్యాలంటరీ అవార్డులను ప్రకటించింది రక్షణశాఖ. మొత్తంగా 384 మందికి శౌర్య పురస్కారాలు, ఇతర అవార్డులు ప్రతిపాదించగా రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.

kovind
కోవింద్
author img

By

Published : Jan 26, 2022, 2:29 AM IST

Republic Day 2022: దేశ రక్షణలో అసమాన్య ధైర్య సాహసాలు ప్రదర్శించిన సాయుధ దళాల సిబ్బందికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్యాలంటరీ అవార్డులు ప్రకటించారు. మొత్తం 384 మంది సిబ్బందికి శౌర్య పురస్కారాలు ఇతర రక్షణ సంబంధిత అవార్డులను రక్షణశాఖ ప్రతిపాదించగా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.

73వ గణతంత్ర వేడుకల సందర్భంగా రాష్ట్రపతి.. సాయుధ దళాల సిబ్బందికి ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. 12 శౌర్య చక్ర పురస్కారాలు సహా 29 పరమ విశిష్ట సేవా పతకాలు, 4 ఉత్తమ యుద్ధ సేవా పతకాలు, 53 అతి విశిష్ట సేవా పతకాలు, 13 యుద్ధ సేవా పతకాలు, 3 బార్ టు విశిష్ట సేవా పతకాలు, 122 విశిష్ట సేవా పతకాలు, 3 బార్‌ టు సేన పతకాలు, 81 సేన పతకాలు, 2 వాయు సేన పతకాలు, 40 సేన పతకాలు, 8 నావో సేన పతకాలు, 14 వాయు సేన పతకాలు ఉన్నట్లు రక్షణశాఖ కార్యాలయం వెల్లడించింది.

టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రాకు పరమ్‌ విశిష్ట్ సేవా మెడల్‌ పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరుప్రోలు జస్వంత్ కుమార్‌ రెడ్డికి మరణానంతరం శౌర్యచక్ర పురస్కారం లభించింది. 2021 జులై 8న సిపాయి జస్వంత్ కుమార్ రెడ్డి.. దట్టమైన అడవుల్లో ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా జరిగిన కాల్పుల్లో వీర మరణం పొందారు.

ఇదీ చదవండి:

పద్మభూషణ్ అవార్డును తిరస్కరించిన బంగాల్ మాజీ​ ముఖ్యమంత్రి బుద్ధదేవ్

73వ గణతంత్ర వేడుకలకు భారతావని సిద్ధం- ప్రత్యేకతలు ఇవే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.