ETV Bharat / bharat

'ఆఫీస్​లో దుష్టశక్తి'- ప్రభుత్వ ఉద్యోగుల ప్రార్థనలు- దర్యాప్తునకు ఆదేశించిన కలెక్టర్ కృష్ణతేజ - త్రిస్సూర్​ ప్రార్థన వివాదం

Religious Prayer in Government Office : కేరళ త్రిస్సూర్​ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన వివాదాస్పద ప్రార్థనలపై దర్యాప్తునకు ఆదేశించారు కలెక్టర్​. టీవీ ఛానెళ్లలో వచ్చిన వార్తలను ఆధారంగా తీసుకుని ఈ విషయాన్ని దర్యాప్తు చేయాలని సబ్​ కలెక్టర్​ను ఆదేశించారు కలెక్టర్​ కృష్ణతేజ.

Prayer at govt office in Thrissur sparks row
Religious Prayer in Government Office
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2023, 10:26 AM IST

Updated : Nov 13, 2023, 7:03 PM IST

Religious Prayer in Government Office : కార్యాలయంలో ఉన్న దుష్టశక్తులను తొలగించాలంటూ ప్రభుత్వ ఉద్యోగులతో ప్రార్థనలు చేయించారు ఓ ఉన్నతాధికారి. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్​లోని చిన్నారుల సంరక్షణ అధికారి కార్యాలయంలో జరిగింది. టీవీ ఛానెళ్లలో వచ్చిన వార్తల ఆధారంగా తీసుకుని ఈ విషయాన్ని దర్యాప్తు చేయాలని సబ్​ కలెక్టర్​ను ఆదేశించినట్లు కలెక్టర్​ కృష్ణతేజ తెలిపారు.

ఇదీ జరిగింది
త్రిస్సూర్​ జిల్లా చిన్నారుల సంరక్షణ అధికారి కార్యాలయంలో ఈ వివాదాస్పద ప్రార్థన జరిగింది. గత నెలలో కార్యాలయంలోని ఉద్యోగులందరినీ అత్యవసర సమావేశం కావాలని ఆదేశించిన ఓ ఉన్నత అధికారి.. మతపరంగా పవిత్రంగా భావించే ఓ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ప్రార్థన చేపట్టారు. కార్యాలయంలో దుష్టశక్తులు ఉన్నాయని.. వాటిని తొలగించాలని ప్రార్థనలు చేయాలని ఆదేశించారు. కార్యాలయంలో ఉన్నతాధికారి మినహా మిగిలినవారు ఒప్పంద ఉద్యోగులు కావడం వల్ల ఎవరూ నోరు మెదపలేదు. అయితే, తాజాగా కలెక్టర్​ దృష్టికి రావడం వల్ల దర్యాప్తునకు ఆదేశించారు.

'వారిని చంపి, వండుకుని తినేసిన భార్యాభర్తలు!'.. నరబలి కేసులో షాకింగ్ నిజాలు
అంతకుముందు కేరళలోని పతనంతిట్ట జిల్లాలో మూఢ నమ్మకాలకు బలయ్యారు దంపతులు. నరబలి ఇస్తే ఆర్థికంగా లాభపడతామని ఆశపడ్డారు దంపతులు, మరో వ్యక్తి. ఈ క్రమంలో కొచ్చికి చెందిన ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చి.. వారి మృతదేహాలను ముక్కలు చేసి పాతిపెట్టారు. తిరువళ్లకు చెందిన భగవంత్​ సింగ్​, అతని భార్య లైలా ఈ దారుణానికి పాల్పడ్డారు. వీరికి మహ్మద్ షఫీ అనే మరో వ్యక్తి తోడయ్యాడు. మహ్మద్ షఫీ.. సోషల్ మీడియాలో కొచ్చికి చెందిన ఇద్దరు మహిళలతో స్నేహం చేశాడు. సెప్టెంబరు 26వ తేదీన ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేశాడు. అనంతరం భగవంత్​ సింగ్ దంపతులతో కలిసి బలి ఇచ్చాడు. మాంత్రికుడి సూచనల మేరకు మృతుల శరీర భాగాల్ని వండుకుని మరీ తిన్నారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. మృతులను పద్మం (52), రోస్లి(50)గా గుర్తించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చిన్ని చేతులే ఆపన్నహస్తాలు.. పేదరిక నిర్మూలనకు తెలుగు కలెక్టర్​ కృషి

Kerala Blast Today : కన్వెన్షన్​ సెంటర్​లో భారీ పేలుడు.. అనేక మందికి గాయాలు.. ఉగ్రదాడి?

Last Updated : Nov 13, 2023, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.