New Vehicles Registration Stopped In Telanagana : తెలంగాణ వ్యాప్తంగా కొత్తవాహనాల రిజిస్ట్రేషన్ పక్రియ నిలిచిపోయింది. ఇవాళ ఉదయం నుంచి ఆర్టీఏ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. రవాణశాఖకు సంబంధించి సర్వర్ డౌన్ అవ్వడం వలన వాహనాల రిజిస్ట్రేషన్‌తో పాటు పలు కార్యకలాపాలు ఆగిపోయాయి. ఆర్టీఏ వెబ్‌సైట్‌లో వాహనాలు వివరాలు కనిపించకపోవడంతో కొత్తవాహన దారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. స్లాట్ బుక్ చేసి రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఉదయం నుంచి కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఆర్టీఏ కార్యాలయాల్లో కొత్తవాహన దారులతో కిటకిటలాడుతున్నాయి. రవాణాశాఖ అధికారుల నిర్లక్ష్యంపై వాహనదారులు మండిపడుతున్నారు. ఉదయం నుంచి సర్వర్ పనిచేయడం లేదని.. ఇంత వరకు దానిని సరిచేయడంలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు రవాణాశాఖ అధికారులు దీనిపై స్పందించారు. ఇవాళ స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ కాని వాహనదారులకు మరొకరోజు స్లాట్ కేటాయిస్తామన్నారు. దానికి సంబంధించిన పనులను సంబంధిత శాఖ చేపడుతుందని.. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. రేపటి నుంచి యథావిధిగా ఆర్టీఏ కార్యాలయ పనులు కొనసాగుతాయని రవాణాశాఖ ఉన్నతాధికారులు వాహనదారులకు వివరించారు.
- రికార్డు స్థాయిలో రవాణాశాఖ ట్యాక్స్ వసూళ్లు.. ఏకంగా రూ. 6,390 కోట్లు
- Good News: వాహనదారులకు ఆన్లైన్లో 17 రకాల సేవలు
RTA Registration Cards: ఆర్టీఏ రిజిష్ట్రేషన్ కార్డులు పూర్తిగా మారిపోయాయి. అధునాతన రక్షణ అంశాలతో పాటు రంగు మారిపోయింది. దేశం అంతటా ఒకే కార్డు ఉండేలా ఈ మార్పులు చేశారు ఆర్టీఏ అధికారులు. చిప్‌తో పాటు కార్డుల వెనుక భాగంలో క్యూఆర్ కోడ్‌ను అమర్చారు. దీంతో నకిలీ కార్డులను సులువుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సుల జారీలో ఈ పద్దతిని అమలు చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ వెనుక ఏ వాహనం నడిపే అనుమతి ఉందో దానికి సంబంధించిన చిత్రాలను ముద్రించారు. దీంతో సదరు వాహన దారుడు ఏ వాహనం నడపడానికి అవకాశం ఉందో సులువుగా తెలుసుకోవచ్చు.
RTA Tax Collections increased in Telangana: కొన్నినెలలుగా పేరుకుపోయిన వాహన బకాయిల వసూళ్లకు రవాణా శాఖ అధికారులు చేపట్టిన చర్యలు మంచి ఫలితాలనిచ్చాయి. 2021-22 సంవత్సరంలో రూ.3 వేల 971.38 కోట్ల ఆదాయం వస్తే 2022-23 ఆర్థిక ఏడాదిలో రూ.6 వేల 390.80 కోట్ల ఆదాయం వచ్చినట్లు రవాణాశాఖ అధికారులు ప్రకటించారు. గతేడాదితో పోలిస్తే 61 శాతం అధికంగా రవాణాశాఖకు ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు.
పన్నులు చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతున్న వాహనదారుల కోసం ఫిబ్రవరి 15 నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టి వాహన బకాయిలు వసూళ్లు చేశారు. త్రైమాసిక పన్ను కట్టకుండా రోడ్లపై తిరిగే దాదాపు 16వేల వాహనాలను హైదరాబాద్‌లో ముందుగా అధికారులు గుర్తించారు. వాటి నుంచి ట్యాక్స్ కట్టించాలని లక్ష్యంగా చేసుకున్న రవాణాశాఖ అధికారులు ఆరు బృందాలుగా విడిపోయి ప్రత్యేక తనిఖీలు నిర్వహిచారు.
ఇవీ చదవండి: