ETV Bharat / bharat

జైలులో మంత్రికి బయటి ఫుడ్.. కొత్త వీడియోతో సత్యేందర్​కు మరిన్ని చిక్కులు - Satyendar Jain food video

ఇప్పటికే వివాదాలలో చిక్కుకున్న సత్యేందర్ జైన్ తాజాగా మరో వీడియో ద్వారా వార్తల్లోకెక్కారు. జైలులో బయట నుంచి తెప్పించుకున్న ఆహారం తింటున్న వీడియో బయటకు వచ్చింది.

reduction in facilities after video of satyendar jain massage
జైల్లో బయటి ఆహారం తెప్పించుకుని తింటున్న జైన్
author img

By

Published : Nov 23, 2022, 1:30 PM IST

Updated : Nov 23, 2022, 2:23 PM IST

జైల్లో బయటి ఆహారం తెప్పించుకుని తింటున్న జైన్

తీహాడ్ జైలులో ఉన్న దిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌ బయట నుంచి తెప్పించుకున్న ఆహారం తింటున్న వీడియో వెలుగులోకి వచ్చింది. జైన్‌కు మతవిశ్వాసాల ప్రకారం ఆహారం అందించడంలేదని ఆయన తరఫు న్యాయవాది దిల్లీ కోర్టులో పిటిషన్‌ వేసిన నేపథ్యంలో ఈ వీడియో ప్రాధాన్యం సంతరించుకుంది. సరైన ఆహారం అందక మంత్రి 28 కేజీల బరువు తగ్గారని ఆయన న్యాయవాది ఇర్షాద్‌ పేర్కొన్నారు. జైన మతం ఆచరించే సత్యేంద్ర.. వండిన ఆహారం, ధాన్యాలు, పాలపదార్థాలు తీసుకోరని ఆయన న్యాయవాది తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పండ్లు, కూరగాయలు, విత్తనాలు, డ్రైఫ్రూట్స్‌, ఖర్జూరం మాత్రమే తీసుకుంటారని వివరించారు. ఆ ఆహారాన్ని జైలు వర్గాలు నిలిపివేశాయని పేర్కొన్నారు. ఆయనకు వెన్ను సంబంధిత సమస్యలు సహా అనేక రుగ్మతలు ఉన్నట్లు వివరించారు. ఈ పిటిషన్‌ నేపథ్యంలో జైన్ తన మత విశ్వాసం ప్రకారం తీసుకునే ఆహారం తింటున్న దృశ్యాలు బయటకొచ్చాయి.

మరో వైపు "సత్యేందర్ జైన్​కు ఇంతకు ముందు ఎలాంటి ఆహారం అందించారు? ఇప్పుడు ఎలాంటి ఆహారాన్ని ఇస్తున్నారు? ఆయనకు అక్టోబర్ 21న ఎమ్ఆర్ఐ స్కాన్ చేయాల్సి ఉండగా.. అది ఎందుకు కుదరలేదు? జైన్ దరఖాస్తుకు సంబంధించి, ఈ ప్రశ్నలకు సమాధానాలు పంపించండి" అని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. అయితే సత్యేంద్ర తీహాడ్‌ జైలులో ఉన్నప్పటికీ ఆయన బరువు 8 కేజీలు పెరిగిందని కారాగారం వర్గాలు చెప్పాయి.

ఇప్పటికే సత్యేంద్ర జైన్‌ మసాజ్ వీడియో లీకవడం వల్ల జైలులో ఆయనకు సౌకర్యాలు తగ్గాయి. దీంతోపాటు ఆయనతో ఉన్న మరో ఖైదీ వార్డును మార్చారు. తీహాడ్ జైలు అందించిన సమాచారం ప్రకారం ఆయనకు ఇకపై సెల్​లో ఫిజియోథెరపీ సౌకర్యం అందించరు. ఇందుకోసం జైలులో ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ సెంటర్​కు వెళ్లవలసి ఉంటుంది. వీటితోపాటు ఆయన ఒక్కరికే అందించిన అదనపు సౌకర్యాలు, దిండ్లు, కార్పెట్, కుర్చీలను తీసేసుకున్నారు. అయితే జైల్లో చాలామందికి టీవీ సౌకర్యం ఉంటుంది. కాబట్టి జైన్​ సెల్​లో కూడా టీవీని ఉంచేందుకు అనుమతినిచ్చారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 23, 2022, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.