ETV Bharat / bharat

Ration card Application Status in Telangana : రేషన్ కార్డు జాబితాలో మీ పేరు ఉందా? ఇలా చెక్ చేసుకోండి.. దరఖాస్తు అలా..

author img

By

Published : Aug 10, 2023, 3:33 PM IST

Updated : Aug 10, 2023, 4:57 PM IST

Ration card Application Status : తెలంగాణ పౌర సరఫరాల శాఖ రేషన్ కార్డు జాబితాను క్రమబద్ధీకరించింది. మరి, ఆన్ లైన్ లో ఉంచిన ఈ లిస్టులో మీ పేరు ఉందా? కొత్తగా దరఖాస్తున్న వారికి కార్డు మంజూరైందా? లేని వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.

Ration_card_in_Telangana.jpg
Ration_card_in_Telangana.jpg

Telangana Ration Card Alert : "రేషన్ కార్డు.." ఇది ఎంత ముఖ్యమైనదో ప్రతి భారతీయ పౌరుడికీ తెలుసు. ఇక, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి మరింత ప్రముఖమైనది. ఏమున్నా లేకున్నా.. రేషన్ కార్డు మాత్రం ఉండాలని భావిస్తారు. అవును మరి.. రేషన్ నుంచి పింఛన్ దాకా.. ప్రభుత్వ పథకాల నుంచి.. అత్యవసర సహాయాల దాకా.. సర్కారు నుంచి పౌరులు పొందే ఎలాంటి సేవలకైనా తొలి అర్హతా పత్రంగా భావించే డాక్యుమెంట్ ఏదైనా ఉందంటే.. అది రేషన్ కార్డే! అంత ముఖ్యమైనది కాబట్టే.. ప్రతి ఒక్కరూ దీనికోసం ఆరాటపడుతుంటారు. అలాంటి రేషన్ కార్డుకు సంబంధించి తెలంగాణ పౌరులకు ఓ అలర్ట్ వచ్చింది. తెలంగాణ పౌర సరఫరాల శాఖ రేషన్ కార్డు జాబితాను క్రమబద్ధీకరించింది. మరి, ఆన్ లైన్ లో ఉంచిన ఈ లిస్టులో మీ పేరు ఉందా? కొత్తగా దరఖాస్తున్న వారికి కార్డు మంజూరైందా? మంజూరైతే ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి? లేని వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.

ఈ అర్హతలు ఉండాలి :

Eligibility for Ration Card Application : రేషన్ కార్డు పొందాలని భావించే వారికి తెలంగాణ ప్రభుత్వం కొన్ని అర్హత ప్రమాణాలు నిర్ణయించింది. ఈ అర్హతలు ఉన్న వారికి మాత్రమే దరఖాస్తు చేసునే వీలు ఉంటుంది.

1. దరఖాస్తుదారు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర పౌరుడై ఉండాలి.

2. ఏడాదికి కుటుంబ ఆదాయం 1.5 లక్షల రూపాయల కన్నా తక్కువ ఉండాలి.

3. దరఖాస్తుదారు ఆధార్ కార్డు కలిగి ఉండాలి.

4. ఓటరు గుర్తింపు కార్డు ఉండాలి.

5. పేద లేదా SC, ST, EBC వర్గాలకు చెందిన వారై ఉండాలి.

6. కుల, నివాస ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి.

7. ఆదాయ ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి.

8. విద్యుత్ బిల్లు

9. బ్యాంక్ పాస్‌బుక్ స్టేట్‌మెంట్

10. ప్రతీ కుటుంబ సభ్యుని పాస్‌పోర్ట్ సైజు ఫొటో.. పూర్తి కుటుంబం వివరాలు.

Gold Loan Vs Gold Sale : డబ్బు కోసం.. బంగారాన్ని అమ్మాలా? తాకట్టు పెట్టాలా?

Ration Card Application on Online : ఈ ధ్రువీకరణ పత్రాలు, వివరాలతో.. ఎలాంటి కార్యాలయాలకు వెళ్లకుండానే.. ఆన్ లైన్ ద్వారా రేషన్ కార్డు దరఖాస్తు సమర్పించవచ్చు. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్ www.epds.telangana.gov.in. లోకి లాగిన్ కావాలి.

Ration Card Application search on Online వెబ్‌సైట్లోకి ప్రవేశించిన తర్వాత ఎడమ వైపున "FSC Search" అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత.. "అప్లికేషన్ సెర్చ్"ను సెలక్ట్ చేసుకొని.. అడిగిన వివరాలన్నీ సమర్పించాల్సి ఉంటుంది.

Ration Card Application Status : ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు తమ కార్డు స్టేటస్ గురించి తెలుసుకోవాలంటే.. మళ్లీ అదే "FSC Search" ఆప్షన్ లోకి వెళ్లాలి. ఆ తర్వాత.. దరఖాస్తు సమయంలో ఇచ్చిన FSC రిఫరెన్స్ నంబర్, జిల్లా సెలక్ట్ చేసుకొని మీ కార్డు స్థితిని తెలుసుకోవచ్చు.

Ration Card Application Rejection : ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే.. అందుకు గల కారణమేంటో తెలుపుతారు. దీనికోసం "Status of Rejected Ration Card Search" అనే ఆప్షన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది.

Ration Card Holders : ఆల్రెడీ కార్డు ఉన్న వారు.. "FSC Search" ఆప్షన్ లోకి వెళ్లి, కార్డు నంబర్ ఎంటర్ చేయడం ద్వారా వివరాలను చూసుకోవచ్చు.

Minority 1 Lakh Scheme in Telangana : మైనార్టీలకు రూ.లక్ష ఆర్థికసాయం.. ఇవీ అర్హతలు.. ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి

Govt Bank FD Interest Rates 2023 : ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేస్తున్నారా?.. అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే!

LIC Aadhaar Shila Policy : ఎల్​ఐసీ 'సూపర్​ పాలసీ'.. రూ.87 పెట్టుబడితో రూ.11 లక్షలు విత్​డ్రా!

Last Updated : Aug 10, 2023, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.