రాష్ట్రపతి భవన్ సందర్శనకు తిరిగి అనుమతిస్తూ అధికారులు నిర్ణయించారు. ఈ నెల 6 నుంచి సందర్శకులకు అనుమతి ఉంటుందని రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది.
కరోనా ప్రభావంతో గత ఏడాది మార్చి 13 నుంచి సందర్శకులను ఆపేసింది. ఇప్పుడు.. కొవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టడం, రాష్ట్రపతి భవన్లో అనేక జాగ్రత్తలు తీసుకున్న తర్వాత సందర్శకులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది.
ఇవి పక్కా..
మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కొవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.
ప్రతి శనివారం, ఆదివారం సందర్శకులకు అవకాశం ఉంటుంది. గతంలో విధంగానే.. రాష్ట్రపతి భవన్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరు రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: సభా సమయాల్లో స్వల్ప మార్పులు