Minor Rape In Rajasthan: రాజస్థాన్ కోటా జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. 12 ఏళ్ల గిరిజన బాలికపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. వీరు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డానికి సొంత తాత సహకారం అందించాడు. బాలిక గర్భవతి కావడం వల్ల ఈ విషయం బయటకు వచ్చింది. నిందితులతో పాటు బాలిక తాతను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిపై పోక్సో చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితులను గురువారం కోర్టు ఎదుట హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. బాలికకు చికిత్స కొనసాగుతుందని.. అబార్షన్‌కు అనుమతి లభించినట్లు పోలీసులు తెలిపారు.
కోట ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన 12 ఏళ్ల గిరిజన బాలిక రోజులాగే పాఠశాలకు వెళ్లింది. అక్కడ కళ్లు తిరిగి పడిపోవడం వల్ల ఆమెను అస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించగా.. ఆమె ఐదు నెలల గర్భవతి అని తేలింది. బాలిక తండ్రి 12 ఏళ్ల కిందే మరణించాడు దీంతో మతిస్తిమితం లేని తన తల్లితో కలిసి తాతయ్య వద్ద నివసిస్తోంది. కాగా, మద్యానికి బానిసైన బాలిక తాతయ్య రూ. 500 కోసం ఆమెపై అత్యాచారానికి ప్రోత్సహించాడు. దీంతో రామ్‌లాల్ భీల్ అనే 50 ఏళ్ల వ్యక్తి కొన్ని నెలలుగా అత్యాచారం చేశాడు. మరో నిందితుడు 20 ఏళ్ల అజయ్ భైరవ.. గత ఆరు నెలల్లో అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట పెడితే చంపెస్తానని బెదిరించాడు. బాలిక గర్భం దాల్చడం వల్ల ఈ విషయం బయటికి వచ్చింది.
ఇదీ చదవండి: సరూర్‌నగర్ తరహాలో మరో పరువు హత్య.. మతాంతర ప్రేమ వల్లే..