ETV Bharat / bharat

బాలికపై అత్యాచారం.. ఎన్​కౌంటర్​లో నిందితుడు హతం! - ఎనిమిదేళ్ల బాలిక అత్యాచారం

Rape accused killed in encounter: ఎనిమిదేళ్ల బాలికను అపహరించి, అత్యాచారానికి పాల్పడ్డ ఓ వ్యక్తిని పోలీసులు కాల్చి చంపేశారు. ఆడుకోవడానికి బయటకు వెళ్లిన బాలికను.. నిందితుడు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

kanpur Police shot the accused
kanpur Police shot the accused
author img

By

Published : Jan 19, 2022, 12:29 PM IST

Rape accused killed in encounter: ఉత్తర్​ప్రదేశ్​లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిని పోలీసులు ఎన్​కౌంటర్​లో చంపేశారు. కాన్పుర్​లోని కల్యాణ్​పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

Kanpur Rape encounter

ఆడుకోవడానికి వెళ్లిన ఆమెను స్థానికంగా నివాసం ఉండే ఆకాశ్ గౌర్ అనే వ్యక్తి సోమవారం సాయంత్రం కిడ్నాప్ చేశాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడి పరార్ అయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో ఇంటికి చేరుకున్న బాధితురాలు.. తన కుటుంబ సభ్యులకు విషయాన్ని వివరించింది. దీంతో బాలిక బంధువులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వెంటనే నిందితుడిని పట్టుకునేందుకు తనిఖీలు ప్రారంభించారు.

బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలియగానే గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదేసమయంలో తారసపడిన నిందితుడిని ఎన్​కౌంటర్​లో చంపేశారు పోలీసులకు. బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి: బస్సులో చెలరేగిన మంటలు.. మహిళ సజీవ దహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.