ETV Bharat / bharat

అర్ధరాత్రి సైకిల్​పై పెట్రోలింగ్.. మహిళా ఐపీఎస్ సందేశం! - చెన్నై మహిళా ఐపీఎస్ సైక్లింగ్ పెట్రోలింగ్

Joint Commissioner night patrol: మహిళా ఐపీఎస్ అధికారి.. అర్ధరాత్రులు సైకిల్​పై తిరుగుతూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఏ సమయంలోనైనా ప్రజాసేవ చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉంటారన్న సందేశం ఇచ్చేందుకు ఇలా చేస్తున్నారు. ఆమె తెగువను ముఖ్యమంత్రి సైతం ప్రశంసించారు.

Joint commissioner Ramya Bharathi Night Patrol

author img

By

Published : Mar 28, 2022, 3:02 PM IST

Updated : Mar 28, 2022, 3:38 PM IST

అర్ధరాత్రి సైకిల్​పై మహిళా ఐపీఎస్ పెట్రోలింగ్

Joint Commissioner night patrol: చెన్నై మహిళా ఐపీఎస్ అధికారి తెగువ చూపిస్తున్నారు. అర్ధరాత్రి తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలో సైకిల్​పై ఒంటరిగానే గస్తీ తిరుగుతున్నారు. రాత్రిపూట డ్యూటీలో ఉన్న గార్డ్​లను పర్యవేక్షిస్తున్నారు. కొంతకాలంగా ప్రతి రాత్రి 2.30 నుంచి ఉదయం 4.30 వరకు సైక్లింగ్ చేస్తూ పలువురు అనుమానితుల్ని ప్రశ్నించారు. ఏ సమయంలోనైనా ప్రజలకు సేవ చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారనే సందేశాన్ని ఇస్తున్నారు.

Joint commissioner Ramya Bharathi Night Patrol
మహిళా ఐపీఎస్ పెట్రోలింగ్

Chennai police patrol cycle: చెన్నై నార్త్ జోన్​లో జాయింట్ కమిషనర్​గా పనిచేస్తున్న రమ్య భారతి కొద్ది రోజులుగా సైకిల్​పై రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. మార్చి 26న రోడ్లపై సైక్లింగ్ నిర్వహించిన రమ్య భారతి.. ఎన్​ఎస్​సీ బోస్​ రోడ్, మింట్ జంక్షన్​, ఎన్నూర్ హైరోడ్ ప్రాంతాల్లో మొత్తం తొమ్మిది కిలోమీటర్లు పెట్రోలింగ్ చేశారు. రాత్రి అధికంగా నేరాలు జరిగే సమయంలోనే ఈమె సైక్లింగ్ చేస్తున్నారు. నేరాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ చర్య ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలకు భద్రత కల్పించడమే తమ ధ్యేయమని తెలిపారు. రమ్య భారతి తెగువను సీఎం స్టాలిన్ కూడా మెచ్చుకున్నారు.

రాత్రి పూట తరచుగా నైట్ షిఫ్ట్​లు చేయడం ద్వారా.. ఏ సమయంలోనైనా పని చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉంటారని సందేశం ఇవ్వొచ్చని అంటున్నారు రమ్య. పోలీసు ఉద్యోగాల్లోనూ మహిళలు రాణించగలరనే సందేశాన్ని మహిళలు ఇవ్వడానికి.. జాయింట్ కమిషనర్ స్థాయిలో ఉండి కూడా రాత్రిపూట సైక్లింగ్ చేయడంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదీ చదవండి: కదం తొక్కిన కార్మిక సంఘాలు.. దేశవ్యాప్తంగా ఆందోళనలు

Last Updated : Mar 28, 2022, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.