ETV Bharat / bharat

'ఆ చట్టాలను రద్దు చేయకపోతే..' కేంద్రానికి టికాయిత్​ అల్టిమేటం

author img

By

Published : Nov 9, 2021, 6:08 PM IST

సాగు చట్టాలను రద్దు చేయకపోతే రైతుల నిరసనను మరింత ఉద్ధృతం చేస్తామని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ కేంద్రాన్ని హెచ్చరించారు. త్వరలో లఖ్​నవూలో జరిగబోయే కిసాన్ మహాపంచాయత్ 'చరిత్రాత్మకం' అవుతుందని ట్విట్టర్‌లో ఉద్ఘాటించారు.

Rakesh Tikait
రాకేశ్ టికాయిత్

సాగు చట్టాలను ఎట్టిపరిస్థితుల్లోనూ రద్దు చేయాల్సిందేనని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ కేంద్రానికి అల్టిమేటం జారీచేశారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ చట్టాలను 'నల్ల చట్టాలుగా' అభివర్ణించిన ఆయన.. త్వరలో లఖ్​నవూలో జరగనున్న కిసాన్ మహాపంచాయత్ వేదికగా వాటికి సమాధి కడతామని స్పష్టం చేశారు.

"పూర్వాంచల్‌లోనూ రైతు ఉద్యమం ఉద్ధృతం అవుతోంది. నవంబర్ 22న లఖ్​నవూలో జరిగే చారిత్రక కిసాన్ మహాపంచాయత్​తో.. రైతు వ్యతిరేక ప్రభుత్వానికి, మూడు నల్ల చట్టాలకు గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది."

-రాకేశ్ టికాయిత్ ట్వీట్

ఇక రైతు నిరసనల వేదికలను ప్రభుత్వం తొలగిస్తే.. పోలీసు స్టేషన్లు, జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయాల వద్ద టెంట్‌లు వేస్తామని టికాయిత్ హెచ్చరించారు. నవంబర్ 27 నుంచి రైతులు తమ ట్రాక్టర్లపై దిల్లీ సరిహద్దులకు చేరుకుని ఆందోళనలను ఉద్ధృతం చేస్తారని ఇప్పటికే ప్రకటించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.