పార్లమెంటులో వ్యవసాయ పరిశోధనాలయాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్. అప్పుడే వ్యవసాయంలో లాభనష్టాలు తెలుస్తాయని అన్నారు. బుధవారం జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు.
"స్వామినాథన్ కమిటీ నివేదికను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. మేం కనీస మద్దతు ధర ఎక్కువ అడుగుతున్నామని వారు భావిస్తున్నారు. అందుకే పార్లమెంటు ఆవరణలోనే ఒక వ్యవసాయ పరిశోధనాలయాన్ని నెలకొల్పండి. పంటలపై పరిశోధనలు చేయండి. అప్పుడైనా మీకు వాటిలో లాభనష్టాలు గురించి తెలుస్తాయి."
- రాకేశ్ టికాయిత్, బీకేయూ నేత
ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఉద్యమంతోనైనా రాజకీయపార్టీలు రైతులు సంక్షేమంపై దృష్టిసారిస్తాయన్నారు.
అంతకుముందు రాజస్థాన్‌లో జరిగిన ఓ సమావేశంలో టికాయిత్ మాట్లాడుతూ.. నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోకుంటే 40లక్షల ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తామన్నారు. మరోవైపు కేంద్రం ప్రతిపాదనను రైతు సంఘాలు అంగీకరిస్తే చర్చలకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు.
ఇదీ చూడండి: 'బలగాల ఉపసంహరణ ఇరువర్గాలకూ ప్రయోజనకరమే'