ETV Bharat / bharat

ఆస్ట్రేలియా రక్షణమంత్రితో రాజ్​నాథ్​ భేటీ ఫలప్రదం - భారత్ ఆస్ట్రేలియా

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, శాంతి, సమీకృత పాలనపైనే ఆస్ట్రేలియా-భారత్​ మధ్య చర్చలు, అభివృద్ధి ఆధారపడి ఉన్నాయని రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా రక్షణ మంత్రితో చర్చలు ముగిసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చలు ఫలప్రదంగా సాగాయన్నారు.

Rajnath holds talks with Australian defence minister
ఆస్ట్రేలియా రక్షణమంత్రితో రాజ్​నాథ్​ సమావేశం
author img

By

Published : Sep 10, 2021, 6:08 PM IST

Updated : Sep 10, 2021, 7:30 PM IST

భారత్​, ఆస్ట్రేలియా మధ్య చర్చలు ఫలప్రదంగా సాగాయని రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, శాంతి, సమీకృత పాలనపైనే ఇరు దేశాల మధ్య చర్చలు అభివృద్ధి ఉన్నాయన్నారు. ఆస్ట్రేలియా రక్షణమంత్రి పీటర్​ డట్టన్​​తో దిల్లీలో జరిగిన భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.

"ఆస్ట్రేలియా రక్షణ మంత్రి డట్టన్​తో చర్చలు ఫలప్రదంగా సాగాయి. రక్షణ భాగస్వామ్యంపై, స్థానిక పరిస్థితులపైనా చర్చలు జరిపాం. భారత్​- ఆస్ట్రేలియా ద్వౌత్యపరమైన చర్చలు బలోపేతం చేయటంపై దృష్టిసారించాం."

-- రాజ్​నాథ్​సింగ్, రక్షణమంత్రి

శాంతి, అభివృద్ధి, వ్యాపార-వాణిజ్యం, ఆర్థికాభివృద్ధి.. తదితర అంశాల్లో ఆస్ట్రేలియా, భారత్​లు ముందుకెళ్తున్నాయన్నారు రాజ్​నాథ్​. మలబార్​ 2020 విన్యాసాల్లో ఆస్ట్రేలియా పాల్గొనటంపై ఇరు దేశాలు హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు.

త్వరలో ఇరు దేశాల మధ్య 2+2 సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇదీ చదవండి: ఈ నెల 23న అమెరికా పర్యటనకు మోదీ

Last Updated : Sep 10, 2021, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.