Rajinikanth Governor : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. రాజకీయ ప్రవేశం గురించి గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తాజాగా తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం.. రజనీని కలిసిన ఒకరోజు తర్వాత తలైవా సోదరుడు సత్యనారాయణ రావు చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
'అంతా దేవుడి చేతుల్లోనే'
Rajinikanth Brother Comments : రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ రావు.. తమిళనాడు మధురై జిల్లాలోని రెండు వివాహ కార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆ సమయంలో విలేకరులు.. ఆయనను పలకరించి పలు ప్రశ్నలు వేశారు. రజనీకాంత్‌కు గవర్నర్ పదవి? వస్తుందా అని విలేకరులు అడిగారు. దీనికి ఆయన 'అంతా దేవుడి చేతుల్లోనే ఉంది. రజనీకి గవర్నర్ పదవి ఇష్టం లేదు. ఒకే వేళ ఇచ్చినా వద్దనరేమో!' అని అన్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని తెలిపారు. రజనీకాంత్‌ను ఓపీఎస్ మర్యాదపూర్వకంగానే కలిసి ఉంటారని.. రాజకీయ ప్రవేశం కోసం కాదని చెప్పారు.
రజనీని కలిసిన పన్నీర్ సెల్వం
OPS Meet Rajinikanth : అయితే శనివారం.. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. రజనీని ఆయన ఇంట్లో కలిశారు. ఆ తర్వాత తమ భేటీ గురించి ఓపీఎస్.. ఎక్స్(ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. "అనేక ఎత్తులను తాకి.. శాశ్వతంగా శిఖరాగ్రంలో నిలిచిన సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో సమావేశం చాలా ఆనందంతోపాటు సంతృప్తిని కలిగించింది" అంటూ రాసుకొచ్చారు. మరోవైపు, ఓపీఎస్ కొత్త పార్టీ మొదలపెట్టనున్నట్లు తమిళ నాట ప్రచారం జరుగుతోంది.
-
உச்சங்கள் பல தொட்டு அப்படி எட்டிய உச்சத்தில் இன்றளவும் சாஸ்வதமாய் நிலைத்து நிற்கும் சூப்பர்ஸ்டார் @rajinikanth அவர்களுடனான சந்திப்பு மிகுந்த மகிழ்ச்சியையும் மனநிறைவையும் தந்தது... pic.twitter.com/OhqfNpcCuq
— O Panneerselvam (@OfficeOfOPS) September 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">உச்சங்கள் பல தொட்டு அப்படி எட்டிய உச்சத்தில் இன்றளவும் சாஸ்வதமாய் நிலைத்து நிற்கும் சூப்பர்ஸ்டார் @rajinikanth அவர்களுடனான சந்திப்பு மிகுந்த மகிழ்ச்சியையும் மனநிறைவையும் தந்தது... pic.twitter.com/OhqfNpcCuq
— O Panneerselvam (@OfficeOfOPS) September 2, 2023உச்சங்கள் பல தொட்டு அப்படி எட்டிய உச்சத்தில் இன்றளவும் சாஸ்வதமாய் நிலைத்து நிற்கும் சூப்பர்ஸ்டார் @rajinikanth அவர்களுடனான சந்திப்பு மிகுந்த மகிழ்ச்சியையும் மனநிறைவையும் தந்தது... pic.twitter.com/OhqfNpcCuq
— O Panneerselvam (@OfficeOfOPS) September 2, 2023
జైలర్ రిలీజ్‌కు ముందే హిమాలయాలకు..
Rajinikanth Himalayas : రజనీకాంత్ ఇటీవలే నటించిన జైలర్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. రూ.600 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. అయితే ఆ సినిమా విడుదలకు ముందే రజనీ.. హిమాలయాలకు వెళ్లారు. అక్కడ ఓ గుహలో ధ్యానం చేశారు. పవిత్ర బద్రీనాథ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఆ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్ వెళ్లి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. ఆ సమయంలో యోగి పాదాలకు రజనీ నమస్కరించారు. ఝార్ఖండ్ గవర్నర్‌తో భేటీ కూడా అయ్యారు. దీంతో రజనీ రాజకీయ రంగ ప్రవేశం ఖాయమని చర్చ జరిగింది. అయితే తనకు యోగి, సన్యాసిల పాదాలను తాకి ఆశీర్వాదాలు తీసుకోవడం అలవాటు అని.. తనకన్నా చిన్న వ్యక్తి అయినా అలానే చేస్తానని స్పష్టతనిచ్చారు. ఆ తర్వాత అయోధ్య రామాలయానికి వెళ్లి రామ్‌లల్లాను దర్శించుకున్నారు. నూతన ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు.