మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధుడు తనకు తీవ్రంగా కడుపు నొప్పిగా ఉందని జిల్లా ఆస్పత్రిలో చేరాడు. పరీక్షలు చేసిన వైద్యులు అతని పొట్టలో ఉన్న గ్లాసును చూసి షాక్‌కు గురయ్యారు. గత నాలుగు నెలలుగా ఆ గ్లాస్ తన కడుపులోనే ఉందని తెలుసుకుని నివ్వెరపోయారు.
వివరాల్లోకి వెళ్తే.. అమావత్ గ్రామానికి వెళ్లిన రామ్‌దాస్ అనే వ్యక్తిని కొందరు దారుణంగా కొట్టి, అతడ్ని ఓ గ్లాస్‌పై కూర్చోబెట్టారు. దీంతో గ్లాస్ అతని పొట్టలోకి వెళ్లిపోయింది. గ్రామస్థులు ఈ అమానవీయ చర్యను చూసినప్పటికీ ఆ వృద్ధుడికి ఎటువంటి సహాయం చేయలేకపోయారు. ఘటన జరిగి నాలుగు నెలలు గడిచినా ఈ విషయాన్ని సిగ్గు కారణంగా రాందాస్ ఎవరికీ చెప్పలేదు. నొప్పి ఎక్కువ అవ్వడం వల్ల చతుఖేడ చేరుకుని గ్రామస్థులకు సమాచారం అందించాడు. దీంతో గ్రామస్థులు అతడిని ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో పరీక్షలు చేసిన వైద్యులు.. ఆపరేషన్ ద్వారా గ్లాస్‌ను బయటకు తీస్తామన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడి వాంగ్మూలాన్ని తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటన జరిగి 4 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు రాందాస్ ఎవరికీ సమాచారం ఇవ్వలేదని, తనపై దాడికి పాల్పడిన వారు ఎవరో కూడా తెలియనందున పొరపాటున మర్మాంగాల ద్వారా ఈ గ్లాసు లోపలకు వెళ్లి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పోలీసులు అన్నారు.
ఆడుతూ క్లచర్ మింగిన ఐదు నెలల చిన్నారి
మరోవైపు.. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ఓ ఐదు నెలల చిన్నారి ఆటవిడుపులో ఓ క్లచర్ను మింగేసింది. దీంతో శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడింది. పాపను గమనించిన కుటుంబసభ్యులు సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లడం వల్ల బిడ్డ క్షేమంగా ఉంది.
ఘాజియాబాద్‌లోని ఉదల్ నగర్ ఇలాఖాకు చెందిన జితేంద్ర అనే వ్యక్తి కోడలు రియా ఆడుకుంటూ తలకు పెట్టుకునే క్లిప్ ఒకటి నోట్లో పెట్టుకుని మింగేసింది. కాసేపటికి పాప ఏడుస్తుండటం వల్ల విషయం అర్థంకాక ఆమెను ఊరడించేందుకు తల్లి ఎత్తుకుంది. అయినా బిడ్డ ఏడుపు ఆపలేదు. తీక్షణంగా గమనించాక బిడ్డ గొంతులో ఏదో అడ్డు పడిందని అర్థమయ్యింది. వెంటనే పాపను తీసుకుని ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్ల పరీక్షలో బిడ్డ గొంతులో క్లచర్ ఉన్నట్లు నిర్ధరణయ్యింది. కానీ చికిత్స చేయడానికి వైద్యులందరూ నిరాకరించారు. ఆఖరికి ఒక డాక్టర్ పాపకు చికిత్స చేసి వస్తువును బయటకు తీశారు.
ఇదీ చదవండి: యాప్‌లో రూ.5వేలు లోన్.. వడ్డీతో కలిపి రూ.80వేలు బాదుడు.. ఐటీ ఉద్యోగి ఆత్మహత్య
రూ.45 చోరీ కేసులో 24ఏళ్లకు తీర్పు.. వృద్ధుడికి శిక్ష.. ఎంత కాలం అంటే..