ETV Bharat / bharat

కూతురిపై తండ్రి అత్యాచారం.. అవమానంతో కొడుకు ఆత్మహత్య - తండ్రి అత్యాచారం

రాజస్థాన్​లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఓ కిరాతక తండ్రి.. సొంత కూతురిపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని ఎవరితో చెప్పుకోవాలో తెలియక.. చివరికి తనలోని బాధనంతా రికార్డు చేసి తన అత్తకు ఆడియో రూపంలో పంపించింది ఆ బాలిక.  32నిమిషాల పాటు ఉన్న ఆడియో క్లిప్ ప్రస్తుతం​ వైరల్​గా మారింది. ఆ ఆడియో విన్న బాలిక సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

father rapers minor girl
కన్న కూతరిపైనే తండ్రి అత్యాచారం.. బాలిక సోదరుడు మృతి
author img

By

Published : Sep 5, 2021, 11:20 PM IST

రాజస్థాన్​ జలోర్​ జిల్లాలో మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన జరిగింది. సొంత కూతురనే విషయాన్ని కూడా మరచిపోయి, కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ తండ్రి.. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక సోదరుడు, మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇదే తొలిసారి కాదు..

ఫోన్​ కొనిస్తాననే నెపంతో.. ఇటీవలే కూతురిని బయటకు తీసుకెళ్లాడు. కొడుకుని కూడా తీసుకెళ్లమని భార్య చెప్పినా, కారులో కూతురిని మాత్రమే తీసుకెళ్లాడు. కొద్ది దూరం వెళ్లాక.. కూతురితో అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఆ తండ్రి ఇంత దారుణానికి ఒడిగట్టడం ఇదే తొలిసారి కాదు. బాలిక నిద్రిస్తున్న సమయంలో ఎన్నోసార్లు లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమెను ఇంటి బయటకు ఒంటరిగా పంపేవాడు కాదు. కనీసం ఇంట్లో వాళ్లతో కూడా సరిగ్గా మాట్లాడనిచ్చే వాడు కాదు.

తండ్రి ప్రవర్తనపై ఆ మైనర్​ ఎన్నో సందర్భాల్లో అరిచేది కూడా. కానీ ఇవేవీ తెలియని బాలిక తల్లి.. ఆమెను చాలా తిట్టేది. ఈ విషయాన్ని ఆ బాలిక.. తన అత్తకు ఆడియో రూపంలో పంపించింది. ప్రస్తుతం ఆ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఆ 32నిమిషాల ఆడియో విన్న బాలిక సోదరుడు మానసికంగా కుంగిపోయాడు. శనివారం, సాంచోర్​ ప్రాంతంలో నర్మద కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ పూర్తి వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక తండ్రిని పట్టుకునేందుకు ఆమె నివాసానికి వెళ్లగా.. ఆ కిరాతకుడు అప్పటికే అక్కడి నుంచి పారిపోయాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగినట్టు అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : వితంతువుపై అమానుషం.. జననాంగంలో కర్రతో..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.