Rajasthan Man Flew 1000 Kites : రాజస్థాన్ ఉదయ్‌పుర్‌కు చెందిన ఓ కుటుంబం గాలిపటాలను ఎగురవేయడంలో మాస్టర్స్ చేసింది. ఏంటి ఇందులో కూడా మాస్టర్స్ ఉంటుందా? అని ఆలోచిస్తున్నారా? మరి ఒకే దారంతో 1000 గాలిపటాలను ఎగురవేయడం సాధ్యమా? దానిని సునాయాసంగా చేసి చూపిస్తున్నాడు అబ్దుల్ ఖాదర్. అతడు ఒక్కడే కాకుండా ముందు రెండు తరాలు సైతం ఇదే తరహాలో గాలిపటాలను ఎగురవేయడంలో ప్రావీణ్యం ప్రదర్శించాయి.
మూడు తరాలుగా గాలిపటాలు ఎగురవేయడంలో ప్రావీణ్యం
ఇంటర్నేషనల్ కైట్ రన్నర్‌గా పేరు సంపాదించిన అబ్దుల్ ఖాదర్ గాలిపటాలను ఎగురవేయడంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. సుమారు 20 ఏళ్లుగా గాలిపటాలను ఎగురవేస్తున్న ఖాదర్ అనేక రికార్డులను సాధించాడు. హైదరాబాద్, కేరళ, గోవా, పంజాబ్‌లో జరిగిన కైట్ ఫెస్టివల్స్‌లో పాల్గొన్నాడు. ఇటీవల జరిగిన గుజరాత్ కైట్ ఫెస్టివల్లోనూ ఒకే దారంతో వెయ్యి గాలిపటాలను ఎగురవేయడాన్ని చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. అంతకుముందు తన కుటుంబంలోని రెండు తరాలు కూడా గాలిపటాలను ఎగురవేయడంలో ప్రావీణ్యం సంపాదించాయని చెబుతున్నాడు.
"మా తాత, తండ్రి ఇద్దరూ గాలిపటాలు ఎగురవేయడంలో నైపుణ్యం సంపాదించారు. నేను మూడో తరం వ్యక్తిని. మా తాత నుంచి తండ్రి నేర్చుకున్నారు. ఆ తర్వాత మా నాన్నను చూస్తూ పెరగడం వల్ల నేను నేర్చుకున్నాను. చెక్క, బట్టలను ఉపయోగించి బ్యాలెన్స్ ఉండేలా గాలిపటాలను తయారు చేస్తాం."
--అబ్దుల్ ఖాదర్, గాలిపటాలు ఎగురవేసే వ్యక్తి
గాలిపటాలతో ప్రజల్లో అవగాహన
గాలిపటాలను వివిధ రూపాల్లో రూపొందిస్తున్నాడు అబ్దుల్ ఖాదర్. 15 అడుగుల ఎలుగుబంటి ఆకారంలో గాలిపటం, 45 అడుగుల మూడు రంగుల, యుద్ధ విమానం, సీతాకోక చిలుక మాదిరిగా తయారు చేశాడు. వీటిని తయారు చేయాడానికి సుమారు 15 రోజలు సమయం పడుతుందని ఖాదర్ చెప్పుకొచ్చాడు. కేవలం ఎగురవేయడమే కాకుండా ప్రజల్లో అవగాహన కోసం గాలిపటాలతో సందేశాలు ఇస్తున్నాడు. సేవ్ డాటర్, సేవ్ ఎన్విరాన్మెంట్, సేవ్ వాటర్, సేవ్ లేక్స్, కరోనాపై అవగాహన, మత సామరస్యం ఇలా అనేక అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కృషి చేస్తున్నాడు.
సంక్రాంతికి, గాలిపటానికి సంబంధం ఏంటీ? అసలెందుకు ఆరోజు పతంగులను ఎగరవేస్తారు?
గాలిపటం దారంపై జాతీయ గేయం- 20 నిమిషాల్లోనే రాసి రికార్డు- 3మి.మీ పుస్తకంలో హనుమాన్ చాలీసా!