ETV Bharat / bharat

క్వింటాళ్ల కొద్దీ పేలుడు పదార్థాలు లభ్యం.. భారీ కుట్ర భగ్నం.. ఇద్దరు అరెస్ట్

రాజస్థాన్​ జైపుర్​లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఇద్దరు నిందితుల వద్ద నుంచి సుమారు 82 క్వింటాళ్ల అమ్మోనియం నైట్రేట్​, 2095 జిలెటిన్​ స్టిక్స్​, 3250 మీటర్ల ఫ్యూజ్​ వైర్​, 1600 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

explosives seized
explosives seized
author img

By

Published : Jul 18, 2022, 10:35 AM IST

రాజస్థాన్​ జైపుర్​లో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. సుమారు 82 క్వింటాళ్ల అమ్మోనియం నైట్రేట్​, 2095 జిలెటిన్​ స్టిక్స్​ను స్పెషల్ టీం పట్టుకుంది. వీటితో పాటు 3250 మీటర్ల ఫ్యూజ్​ వైర్​, 1600 డిటోనేటర్లు సైతం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

అడిషనల్​ డీసీపీ సులేశ్​ చౌదరి మాట్లాడుతూ.. కమిషనరేట్​ స్పెషల్ టీం, హర్మడా పోలీసులు సంయుక్తంగా మోహన్​బరి గ్రామంలో తనిఖీలు చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు లభించాయని చెప్పారు. వీటిని స్వాధీనం చేసుకున్నామని.. కలురామ్​, గోపాల్​ లాల్​ అనే సోదరులను అరెస్ట్ చేశామని తెలిపారు.​ ఈ పదార్థాలను నీమ్​కథనాకు చెందిన జగదీశ్​ సింగ్​ వద్ద నుంచి వచ్చినట్లు గుర్తించామన్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. నిందితులు కలురామ్​, గోపాల్​ లాల్ గత రెండేళ్లుగా పేలుడు పదార్థాలను అక్రమంగా సరఫరా చేస్తున్నారు. జైపుర్​ రూరల్​ ప్రాంతాల్లోని మైనింగ్స్​లో వీటిని విక్రయిస్తున్నారు. 50 కేజీల అమ్మోనియం నైట్రేట్​ను రూ.7,300 చొప్పున కొన్న నిందితులు.. రూ.15,000కు విక్రయిస్తున్నారు. నిందితుల ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 148 బ్యాగుల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి: మద్యం తాగి వాహనం నడుపుతున్నారా.. అయితే రక్తదానం చేయాల్సిందే!

కూల్​డ్రింక్​లో మత్తుమందు కలిపి.. మైనర్​పై గ్యాంగ్​రేప్​.. కార్ ​రైడ్​కు తీసుకెళ్లి ఎస్సై..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.