ETV Bharat / bharat

గర్భం దాల్చాలని ఖైదీ భార్య కోరిక.. భర్తకు 15 రోజులు పెరోల్ ఇచ్చిన కోర్టు

author img

By

Published : Apr 22, 2022, 7:32 PM IST

Rajasthan High Court Parole: తల్లి కావాలన్న భార్య కోర్కెను తీర్చేందుకు ఓ ఖైదీకి 15 రోజుల పెరోల్​ మంజూరు చేసింది న్యాయస్థానం. తీర్పు సందర్భంగా రాజస్థాన్​ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Rajasthan High Court Parole
Rajasthan High Court Parole

Rajasthan High Court Parole: సాధారణంగా కోర్టు.. ఖైదీలకు పెరోల్​ మంజూరు చేయడం చూస్తూనే ఉంటాం. అయితే.. తల్లి కావాలన్న భార్య కోర్కెను తీర్చేందుకు ఓ ఖైదీకి పెరోల్​ మంజూరు చేసింది రాజస్థాన్ హైకోర్టు జోధ్​పుర్​ బెంచ్​. దోషి భార్య వేసిన పిటిషన్​ను పరిశీలించిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. తల్లి కావాలని ఆరాటపడుతున్న ఆమె కోరికను తిరస్కరించలేమని అభిప్రాయపడింది. అజ్మేర్​ జైలులో శిక్ష అనుభవిస్తున్న 34 ఏళ్ల నంద్​లాల్​ను విడుదల చేయాలని జస్టిస్​ సందీప్​ మెహతా, జస్టిస్​ పర్జాంద్​ అలీ సభ్యులుగా గల డివిజన్​ బెంచ్​ ఆదేశించింది. రూ. 50 వేలతో వ్యక్తిగత పూచీకత్తు సహా రూ. 25 వేల చొప్పున రెండు ష్యూరిటీ బాండ్లు సమర్పించాలని ఖైదీకి స్పష్టం చేసింది.

అమాయకురాలైన ఖైదీ భార్య వైవాహిక జీవితం ప్రభావితం కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు పేర్కొంది. ఏ మహిళ అయినా తల్లి అయినప్పుడే జీవితం పరిపూర్ణం అవుతుందని బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. 16 మతకర్మలలో బిడ్డను కనడం మహిళకు మొదటి హక్కు అని నొక్కిచెప్పింది.

''దోషి భార్య తల్లి కావాలని కోరుకుంటోంది. తన భర్త లేకుండా, తన భర్త నుంచి ఎలాంటి పిల్లలు కలగకుండా ఉండే పరిస్థితుల్లో ఆమె జీవించకూడదు. ఆ మహిళ పిటిషన్​ను తిరస్కరిస్తే ఆమె హక్కులను నిరాకరించినట్లే అవుతుంది. అందుకే.. నిందితుడికి 15 రోజుల పెరోల్​ మంజూరు చేస్తున్నాం.''

- రాజస్థాన్​ హైకోర్టు

జైల్లో తన భర్త ప్రవర్తన సక్రమంగా ఉందని పిటిషన్​లో కూడా ప్రస్తావించింది నంద్​లాల్​ భార్య. తన భర్త పెరోల్​ కోసం అంతకుముందు కలెక్టర్​, జిల్లా పెరోల్​ కమిటీ ఛైర్మన్​కు అర్జీ పెట్టుకుంది. దానిని సాధారణ పిటిషన్​గా భావించి.. ఆమె అభ్యర్థనను తిరస్కరించారు. ఇప్పుడు కోర్టు.. ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ​

ఇవీ చూడండి: కారుకు హెలికాప్టర్​ లుక్.. ఏం బిజినెస్ ఐడియా గురూ!

కాంగ్రెస్​ పాలిత రాష్ట్రంలో 'బుల్​డోజర్'​ ట్రెండ్​.. 300ఏళ్ల నాటి గుడి కూల్చివేత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.