Rajasthan Election 2023 Congress Manifesto : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్ ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక హామీలు కురిపించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపడతామని హామీ ఇచ్చింది. పంచాయతీ స్థాయిలో నియామకాల కోసం కొత్త వ్యవస్థను తీసుకొస్తామని తెలిపింది. రైతులకు రూ.2లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, స్వామినాథన్ కమిషన్ ప్రకారం కనీస మద్దతు ధర ఇస్తామని ప్రకటించింది. ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, అందులో ప్రభుత్వ రంగంలోనే 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించింది.
-
राजस्थान की जनता को कांग्रेस की गारंटी ✋
— Congress (@INCIndia) November 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
🔹चिरंजीवी स्वास्थ्य बीमा की राशि 25 लाख रुपए से बढ़ाकर '50 लाख रुपए' होगी
🔹जाति आधारित गणना होगी
🔹4 लाख सरकारी नौकरियां
🔹10 लाख नए रोजगार
🔹किसानों को 2 लाख तक का ब्याज मुक्त कर्ज
🔹MSP के लिए कानून बनेगा
🔹 गैस सिलेंडर 400 रुपए में
">राजस्थान की जनता को कांग्रेस की गारंटी ✋
— Congress (@INCIndia) November 21, 2023
🔹चिरंजीवी स्वास्थ्य बीमा की राशि 25 लाख रुपए से बढ़ाकर '50 लाख रुपए' होगी
🔹जाति आधारित गणना होगी
🔹4 लाख सरकारी नौकरियां
🔹10 लाख नए रोजगार
🔹किसानों को 2 लाख तक का ब्याज मुक्त कर्ज
🔹MSP के लिए कानून बनेगा
🔹 गैस सिलेंडर 400 रुपए मेंराजस्थान की जनता को कांग्रेस की गारंटी ✋
— Congress (@INCIndia) November 21, 2023
🔹चिरंजीवी स्वास्थ्य बीमा की राशि 25 लाख रुपए से बढ़ाकर '50 लाख रुपए' होगी
🔹जाति आधारित गणना होगी
🔹4 लाख सरकारी नौकरियां
🔹10 लाख नए रोजगार
🔹किसानों को 2 लाख तक का ब्याज मुक्त कर्ज
🔹MSP के लिए कानून बनेगा
🔹 गैस सिलेंडर 400 रुपए में
జయపురలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, సీనియర్ నేత సచిన్ పైలట్ తదితరులు ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటికే పలు గ్యారంటీలను ప్రకటించగా.. తాజాగా కులగణనను అందులో చేర్చింది. ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని మల్లికార్జున ఖర్గే తెలిపారు.
-
राजस्थान में कांग्रेस की बड़ी घोषणा 📢
— Congress (@INCIndia) November 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
'चिरंजीवी स्वास्थ्य सुरक्षा बीमा' की राशि 25 लाख रुपए से बढ़ाकर 50 लाख रुपए की जाएगी।#कांग्रेस_जन_घोषणा_पत्र2 pic.twitter.com/pi3kt1Z7p0
">राजस्थान में कांग्रेस की बड़ी घोषणा 📢
— Congress (@INCIndia) November 21, 2023
'चिरंजीवी स्वास्थ्य सुरक्षा बीमा' की राशि 25 लाख रुपए से बढ़ाकर 50 लाख रुपए की जाएगी।#कांग्रेस_जन_घोषणा_पत्र2 pic.twitter.com/pi3kt1Z7p0राजस्थान में कांग्रेस की बड़ी घोषणा 📢
— Congress (@INCIndia) November 21, 2023
'चिरंजीवी स्वास्थ्य सुरक्षा बीमा' की राशि 25 लाख रुपए से बढ़ाकर 50 लाख रुपए की जाएगी।#कांग्रेस_जन_घोषणा_पत्र2 pic.twitter.com/pi3kt1Z7p0
మేనిఫెస్టోలోని ఇతర ముఖ్య అంశాలివే..
- ఉజ్వల లబ్ధిదారులకు రూ.500కే గ్యాస్ సిలిండర్
- మహిళలకు ఏడాదికి రూ.10వేల నగదు సాయం
- ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానంపై చట్టం
- రైతులకు రూ.2లక్షల వరకు వడ్డీలేని రుణాలు, పంటలకు కనీస మద్దతు ధర
- ప్రభుత్వ కాలేజీలో చేరే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు
- చిరంజీవి మెడికల్ ఇన్స్యూరెన్స్ పథకం రూ.25లక్షల నుంచి రూ.50లక్షలకు పెంపు
- ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు రూ.15లక్షల వరకు బీమా పథకం
-
राजस्थान विधानसभा चुनाव, 2023 के लिए भारतीय राष्ट्रीय कांग्रेस का घोषणा पत्र जारी किया गया।
— Congress (@INCIndia) November 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
हम राजस्थान की जनता से किए अपने सारे वादे निभाएंगे, क्योंकि हम जो कहते हैं-वो कर दिखाते हैं।#कांग्रेस_जन_घोषणा_पत्र2 pic.twitter.com/lL6pUZ4NYG
">राजस्थान विधानसभा चुनाव, 2023 के लिए भारतीय राष्ट्रीय कांग्रेस का घोषणा पत्र जारी किया गया।
— Congress (@INCIndia) November 21, 2023
हम राजस्थान की जनता से किए अपने सारे वादे निभाएंगे, क्योंकि हम जो कहते हैं-वो कर दिखाते हैं।#कांग्रेस_जन_घोषणा_पत्र2 pic.twitter.com/lL6pUZ4NYGराजस्थान विधानसभा चुनाव, 2023 के लिए भारतीय राष्ट्रीय कांग्रेस का घोषणा पत्र जारी किया गया।
— Congress (@INCIndia) November 21, 2023
हम राजस्थान की जनता से किए अपने सारे वादे निभाएंगे, क्योंकि हम जो कहते हैं-वो कर दिखाते हैं।#कांग्रेस_जन_घोषणा_पत्र2 pic.twitter.com/lL6pUZ4NYG
-
రూ.30 లక్షల కోట్లకు ఆర్థిక వ్యవస్థ!
రాజస్థాన్ ఆర్థిక వ్యవస్థ.. 15 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తెలిపారు. 2030 కల్లా జీడీపీని 30 లక్షల కోట్ల రూపాయలకు చేరుస్తామని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను తాము నిర్వహిస్తున్న తీరును చూసి రాష్ట్ర ప్రజలు గర్విస్తున్నారన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం 46.48 శాతం పెరిగిందని వెల్లడించారు.
200 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న రాజస్థాన్‌లో నవంబరు 25వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 23 వరకు ప్రచారానికి గడువు ఉంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్, బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ తమ మేనిఫెస్టోను ప్రకటించింది.
Rajasthan Elections 2023 : రాజస్థాన్‌లో సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? లేక కాంగ్రెస్‌కే జై కొడతారా?
Rajasthan Elections Key Points : మోదీ Vs గహ్లోత్?.. ఈ 5 అంశాలు ఎవరికి కలిసొస్తే వారిదే పీఠం!