Borewell Boy Rescue Operation: రాజస్థాన్లోని శిఖర్ జిల్లాలో సరదాగా ఆడుకుంటున్న ఓ నాలుగేళ్ల బాలుడు అకస్మాత్తుగా అక్కడ ఉన్న బోరుబావిలో పడిపోయాడు. ఆ బాలుడిని వెలికితీసేందుకు అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు .
ఇదీ జరిగింది..
చిన్నారి ఆడుకుంటూ.. అక్కడే తెరిచి ఉన్న ఓ బోరు బావిలోకి జారి పడిపోయాడు. బాలుడి ఏడుపు విని అక్కడికి చేరుకున్న స్థానికులు పిల్లవాడిని వెలికితీసేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడం వల్ల అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
బాలుడు జారి పడిపోయిన బోరుబావి లోతు 55 అడుగులు ఉంటుందని అధికారులు వెల్లడించారు. వీలైనంత త్వరగా బాలుడిని వెలికి తీస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: దారుణం.. 20 ఏళ్ల యువతిని గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది