దిల్లీలో ఆదివారం ఉదయం నుంచి కుండపోతగా కురిసిన వర్షానికి జనజీవనం అతలాకుతలం అయ్యింది. 24 గంటల్లోనే దిల్లీలో 28 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. వచ్చే రెండు రోజుల్లో మరింత తీవ్రతతో వర్షాలు కురుస్తాయని అంచనావేసింది. కాగా, దిల్లీలో ఉష్ణోగ్రత 26డిగ్రీలకు పడిపోయింది.
వాన ధాటికి ప్రధాన రహదారులన్నీ నీటితో నిండిపోగా.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు
![Rains lash Delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12638171_i.jpg)
దిల్లీలోని ఖాన్పుర్లో వరద ఉద్ధృతికి వాహనాలు సగం నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో ఫుట్పాత్లు ధ్వంసమయ్యాయి.
![Rains lash Delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12638171_h.jpg)
యుమునా బజార్లో మోకాళ్ల లోతు వరద పారుతోంది.
![Rains lash Delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12637181_22_12637181_1627790608696.png)
ప్రహ్లాద్పుర్ ప్రాంతంలోని అండర్పాస్ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.
![Rains lash Delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12638171_e.jpg)
భారీ వరదలకు యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఓల్డ్ యమునా బ్రిడ్జ్ వద్ద నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరింది.
![Rains lash Delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12638171_j.jpg)
రాజస్థాన్ అజ్మేర్ వీధుల్లో వరద ఏరులై పారుతోంది. పలు ప్రాంతంలో ఇళ్లు నీటమునిగి, ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.
![Rains lash Delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12638171_c.jpg)
![Rains lash Delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12638171_d.jpg)
ఇదీ చూడండి: కఠినంగా లాక్డౌన్ అమలు- బోసిపోయిన రోడ్లు