మహారాష్ట్ర చంద్రపుర్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 12 మంది గాయపడ్డారు. బల్లార్పుర్ రైల్వే స్టేషన్లో ఉన్న పురాతన పాదచారుల వంతెనలో కింద భాగం కూలింది. దీంతో పట్టాలపై పడిపోయారు ప్రయాణికులు. గాయపడిన వారిలో.. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం ఆదివారం సాయంత్రం 5:10 గంటల సమయంలో జరిగింది. మరోవైపు దీనిపై స్పందించిన సీపీఆర్ఓ.. నలుగురు ప్రయాణికులు గాయపడ్డారని తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్టేషన్కు రైలు వస్తుందన్న హడావుడిలో ప్రజలు ఒక్కసారిగా వంతెనపైకి రావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. వంతెన శిథిలావస్థ స్థితికి చేరుకోవడమూ.. ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించింది రైల్వే శాఖ.
ఇవీ చదవండి: దుండగుల బీభత్సం బైక్పై వచ్చి ఒకేరోజు ఆరు ప్రాంతాల్లో కాల్పులు
విచిత్రంగా జడేజా 'ఫ్యామిలీ పాలిటిక్స్'.. భాజపా అభ్యర్థిగా భార్య.. కాంగ్రెస్ ప్రచారకర్తగా చెల్లి