RRC Loco Pilot Vacancy 2023 : నార్తర్న్ రైల్వే (రైల్వే రిక్రూట్మెంట్ సెల్) 323 అసిస్టెంట్ లోకో పైలెట్, టెక్నీషియన్, జూనియర్ ఇంజినీర్, ట్రైనీ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు
- అసిస్టెంట్ లోకో పైలెట్ - 169
- టెక్నీషియన్ - 78
- జూనియర్ ఇంజినీర్ - 30
- ట్రైనీ మేనేజర్ - 46
విభాగాలు
Engineer Jobs : వర్క్స్, మెకానికల్, డీజిల్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, సిగ్నలింగ్ తదితర విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. పూర్తి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
విద్యార్హతలు ఏమిటి?
RRC Education Qualification : అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ముఖ్యంగా ఆయా పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
నోట్ : మెడికల్లీ అన్ఫిట్గా ఉండే అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు కాదు.
వయోపరిమితి?
RRC Age Limit 2023 : వయోపరిమితి విషయానికి వస్తే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. అన్రిజర్వ్డ్ పోస్టులకు మాత్రం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ - నాన్ క్రిమీలేయర్ రిజర్వేషన్లు వర్తించవు.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
RRC NR Recruitment Selection Process : అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల సర్టిఫికేట్లు వెరిఫై చేసి, ఆయా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
నోట్ : ఆయా పోస్టులను అనుసరించి అభ్యర్థుల మెడికల్ ఫిట్నెస్ను కూడా పరీక్షిస్తారు
దరఖాస్తు ఎలా?
RRC Recruitment 2023 Apply Online : ఆసక్తి గల అభ్యర్థులు నార్తర్న్ రైల్వే అధికారిక వెబ్సైట్ www.rrcnr.org లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ముఖ్యంగా తమ పేరు, తండ్రి పేరు, జన్మదినం తదితర వివరాలను.. మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్లో ఉన్న విధంగా నమోదు చేయాల్సి ఉంటుంది.
అప్లోడ్ చేయాల్సిన పత్రాలు
- పాస్పోర్ట్ సైజ్ ఫొటో (మూడు నెలల లోపు తీసుకున్నది)
- సిగ్నేచర్
- సెల్ఫ్ అటాస్ట్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, కాస్ట్ సర్టిఫికేట్
ముఖ్యమైన తేదీలు
RRC NR Recruitment 2023 Dates :
- దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 2023 జులై 28
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 ఆగస్టు 28
- అప్లికేషన్ అప్లోడ్కు ఆఖరు తేదీ : 2023 సెప్టెంబర్ 01