ETV Bharat / bharat

రాహుల్​ అధ్యక్ష ఎన్నికపై వచ్చేవారం సీఈఏ భేటీ! - కాంగ్రెస్ పగ్గాలు రాహుల్​కు

రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయమై పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం(సీఈఏ) వచ్చేవారం భేటీ కానుంది. పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రతినిధుల జాబితాలో మార్పులు, చేర్పులపై నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. నెలాఖరుకు షెడ్యూల్‌ రూపకల్పన పూర్తవుతుందని, అవరసరమైతే రహస్య బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు ఉంటాయని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

rahul to become congress president again
రాహుల్​ అధ్యక్ష ఎన్నికపై వచ్చేవారం సీఈఏ భేటీ!
author img

By

Published : Dec 3, 2020, 5:07 AM IST

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి మళ్లీ పార్టీ పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆయన్ను కొత్త అధ్యక్షునిగా ఎన్నుకునేందుకు పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం(సీఈఏ) వచ్చేవారం భేటీ కానుంది. ఇదే విషయమై గత నెల 24న సమావేశమైంది. తక్కువ వ్యవధిలోనే మరోసారి భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈనెల 8 న సీఈఏ సమావేశమై పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రతినిధుల జాబితాలో మార్పులు, చేర్పులపై నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. తర్వాత 10 రోజులకు ఓటరు జాబితా పూర్తవుతుంది.

అధ్యక్ష ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ)ని సీఈఏ కోరనుందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. మధుసూదన్‌ మిస్త్రీ నేతృత్వం వహిస్తున్న సీఈఏ నివేదిక అందిన తర్వాత అధ్యక్ష ఎన్నికల ఏర్పాటుపై సీడబ్ల్యూసీ చర్చించి షెడ్యూల్ రూపొందిస్తుంది. నెలాఖరకు షెడ్యూల్‌ రూపకల్పన పూర్తవుతుందని, అవరసరమైతే రహస్య బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు ఉంటాయని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. మరోవైపు పార్టీలోని ఓ వర్గం సీనియర్‌ నేతలు నాయకత్వ మార్పును కోరుతూ ఇటీవల తమ గళం వినిపించిన క్రమంలో ఒకవేళ గాంధీయేతరులు అధ్యక్ష ఎన్నికల్లో తలపడితే బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించటం అనివార్యం కావచ్చు.

ఇదీ చూడండి: భాజపా నేతకు ట్విట్టర్ షాక్- తొలిసారి ఇలా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.