ETV Bharat / bharat

'మత్స్యకారులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం' - కాంగ్రెస్​నేత రాహుల్​ గాంధీ

మత్స్యకారులకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఉండాలని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ పునరుద్ఘాటించారు. కేరళలో పర్యటించిన రాహుల్​ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

Rahul interacts with fishermen
'వారికి ప్రత్యేక మంత్రిత్వశాఖ ఉండాల్సిందే'
author img

By

Published : Feb 24, 2021, 11:47 AM IST

Updated : Feb 24, 2021, 2:11 PM IST

మత్స్యకారులకు సంబంధించి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని కాంగ్రెస్​నేత రాహుల్​ గాంధీ మరోసారి డిమాండ్​ చేశారు. అందుకోసమే తాను పోరాడుతున్నట్లు తెలిపారు. కేరళ పర్యటనలో భాగంగా కొల్లాం జిల్లాలోని థంగసేరి బీచ్​లో మత్స్యకారులతో రాహుల్​ ముచ్చటించారు.

మత్స్యకారుల సమస్యల్ని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాహుల్​ అన్నారు. వచ్చే ఎన్నికల్లో మత్స్యకారుల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను తమ యూడీఎఫ్​ కూటమి రూపొందిస్తుందని తెలిపారు.

"రైతులు భూమిని సాగు చేసి పంట పండించినట్లే, మీరు(మత్స్యకారులు) సముద్రంలోకెళ్లి చేపలు పడుతారు. మీరు చేసేది కూడా వ్యవసాయమే. కేంద్రంలో వ్యవసాయానికి మంత్రిత్వశాఖ ఉంది. మత్స్యకారులకు సంబంధించి మంత్రిత్వశాఖ లేదు. దీన్ని సాధించేందుకు నేను ప్రయత్నిస్తాను. దాంతో మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు."

-రాహుల్​ గాంధీ.

సముద్రంలో మరీ లోతుకు పోయి చేపలు పట్టేందుకు అమెరికా కంపెనీతో కేరళలోని ఎల్​డీఎఫ్​ కుదుర్చుకున్న ఒప్పందాన్ని తప్పుబట్టారు రాహుల్​. దీనివల్ల స్థానికంగా చేపలు పట్టుకునేవారు నష్టపోతారని తెలిపారు.

అయితే కేరళ ప్రభుత్వ నిర్ణయం ఆ రాష్ట్రంలో పెద్ద దుమారాన్ని రేపింది. దాంతో ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని సీఎం పినరయి విజయన్..​ సంబంధిత అధికారులను ఆదేశించారు.

చేపలు పట్టిన రాహుల్​ గాంధీ

Rahul Gandhi
కేరళలో చేపలు పడుతోన్న రాహుల్​
Rahul Gandhi
చేపలు పడుతోన్న రాహుల్​ గాంధీ

తనకు చేపలు పట్టడం అంటే చాలా ఇష్టమని రాహుల్​ అన్నారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4:30గంటలకే థంగసేరి బీచ్​లోకెళ్లి మత్స్యకారులతో కలిసి చేపల వేటకు దిగారు. ఆ తర్వాత స్థానికులతో ముచ్చటిస్తూ.. సరదాగా గడిపారు.

ఇదీ చూడండి: కేరళలో భాజపా ఆశలన్నీ 'మెట్రోమ్యాన్​' పైనే!

Last Updated : Feb 24, 2021, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.