ETV Bharat / bharat

'చిన్నారుల కోసమైనా మోదీ ప్రభుత్వం నిద్రలేవాలి' - రాహుల్ గాంధీ ట్వీట్

కరోనా మూడో దశను అడ్డుకునేందుకు మోదీ ప్రభుత్వం చేపట్టిన సన్నాహక చర్యలు, కార్యచరణపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మూడో వేవ్ చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందని వార్తలు వస్తున్న క్రమంలో.. వారి కోసమైనా మోదీ ప్రభుత్వం నిద్రలేవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్​ చేశారు.

Rahul Gandi
రాహుల్ గాంధీ
author img

By

Published : May 18, 2021, 1:36 PM IST

కొవిడ్​-19 మూడో దశ.. చిన్నారులపై అధిక ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో వైరస్​ను ఎదుర్కోవటానికి కేంద్రం చేపట్టిన సన్నాహక చర్యలు, కార్యచరణపై కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.

Rahul Gandi tweet
రాహుల్ ట్వీట్

"కొవిడ్​ మూడో దశ దృష్ట్యా చిన్నారులకు వైరస్​ నుంచి సంరక్షణ అవసరం. చిన్నపిల్లలకు వైద్యసేవలు, వ్యాక్సిన్ ఇప్పటికే అందించాల్సింది. భారత భవిష్యత్తును కాపాడేందుకు మోదీ ప్రభుత్వం.. నిద్రలేవాలి."

-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

ప్రపంచంలో చాలా దేశాలు 12-15ఏళ్ల పిల్లలకు టీకా ఇచ్చేందుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాహుల్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

సన్నాహక చర్యలేవి?

చిన్నారుల వైద్య సేవల కోసం కేంద్రం ఏదైనా కార్యనిర్వహక దళాన్ని ఏర్పాటు చేసిందా? అని ట్విట్టర్​ వేదికగా కాంగ్రెస్​ నేత జైవీర్ షెర్గిల్ ప్రశ్నించారు.

" డార్క్​ చాకెట్లు తినండి, గోమూత్రం తాగండి.. అని సలహాలు ఇవ్వకుండా భాజపా ప్రభుత్వం చిన్నారుల సంరక్షణ కోసం సన్నాహక చర్యలు చేపట్టాలి"

-- జైవీర్ షెర్గిల్, కాంగ్రెస్​ నేత

కరోనా రెండో దశ యువతపై అధిక ప్రభావం చూపింది. మంగళవారం దేశంలో రికార్డు స్థాయిలో 4,329 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 2లక్షల 63వేల మందికి వైరస్ నిర్ధరణ అయింది.

ఇదీ చదవండి : భారత్​ను ఒంటరిగా చుట్టేసిన మహిళ- ఎలాగంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.