ETV Bharat / bharat

ట్విట్టర్​లో ఆ 50 మందిని 'అన్​ఫాలో' చేసిన రాహుల్​

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ఒక్కసారిగా.. 50 మంది ట్విట్టర్​ ఖాతాలను అనుసరించడం మానేశారు. ఇందులో ఆయన సన్నిహితులు, జర్నలిస్టులు, ఇతర ప్రభావశీలురు ఉన్నారు. అందరూ దీని గురించి ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు.

Rahul Gandhi unfollows 50 people
50 మందిని 'అన్​ఫాలో' చేసిన రాహుల్​
author img

By

Published : Jun 2, 2021, 1:55 PM IST

సన్నిహితులు, పాత్రికేయ ప్రముఖులు సహా మరికొంత మందిని ట్విట్టర్​లో అన్​ఫాలో చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ఆయన అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణం తెలియరాలేదు. దాదాపు 50 ఖాతాలను అనుసరించడం మానేసినట్లు సమాచారం. ఈ వార్త ప్రస్తుతం.. కాంగ్రెస్​లో చర్చనీయాంశంగా మారింది.

ఆయన అన్​ఫాలో చేసిన అకౌంట్లలో.. ఇటీవల మరణించిన కాంగ్రెస్​ నేతలు అహ్మద్​ పటేల్​, తరుణ్​ గొగొయి ఖాతాలూ ఉన్నాయి.

రాహుల్​కు ట్విట్టర్​లో కోటీ 80 లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆయన.. ప్రస్తుతం 220 మందిని అనుసరిస్తున్నారు. ఇందులో ఎక్కువగా రాజకీయ నాయకులే ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే రాహుల్​.. ట్విట్టర్​ ద్వారా తరచూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తుంటారు.

ఇదీ చూడండి: బ్లాక్​ ఫంగస్​పై కేంద్రానికి రాహుల్ మూడు ప్రశ్నలు

'మోదీ ఘనత.. కనిష్ఠ జీడీపీ, గరిష్ఠ నిరుద్యోగం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.