కాంగ్రెస్(Congress) నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పుట్టిన రోజు సందర్భంగా పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో బర్త్‌డే(Birthday) జరుపుకోవడం ఇష్టం లేదని తెలిపారు రాహుల్.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ- సోనియా గాంధీ దంపతులకు 1970, జూన్ 19న రాహుల్ జన్మించారు.
సేవా దివస్..
రాహుల్ పుట్టినరోజును.. 'సేవా దివస్'గా గుర్తిస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. ఉచితంగా మాస్కులు, మెడిసిన్ కిట్లు, ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేస్తోంది. మరోవైపు యూత్ కాంగ్రెస్ దిల్లీలోని పేదలకు ఉచితంగా రేషన్ అందిస్తోంది. కాంగ్రెస్ స్టూడెంట్స్ వింగ్.. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఫ్రీ వ్యాక్సినేషన్ క్యాంప్‌ను నిర్వహించింది.
ట్వీట్ విషెస్..
"రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. దేశంలో కొవిడ్ రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో ఆయన పుట్టిన రోజు జరుపుకోవాలని అనుకోవడం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు.. తమ సేవా కార్యక్రమాలను కొనసాగించాలని రాహుల్ కోరారు." అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
ప్రముఖులు ఎంకే స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, కాన్రాడ్ సంగ్మా, అమరీందర్ సింగ్, అశోక్ గెహ్లోత్, భూపేశ్ భఘేల్, శివరాజ్ సింగ్ చౌహాన్.. రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి:సోనియా, రాహుల్ టీకా తీసుకున్నారా?