పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ.. కేంద్రంపై మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మోదీ ప్రభుత్వం పన్ను దోపిడితో నడుస్తోందని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.
-
आपकी गाड़ी चाहे पेट्रोल पे चलती हो या डीज़ल पे, मोदी सरकार टैक्स वसूली पे चलती है!#TaxExtortion pic.twitter.com/dnQu5m7D6T
— Rahul Gandhi (@RahulGandhi) July 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">आपकी गाड़ी चाहे पेट्रोल पे चलती हो या डीज़ल पे, मोदी सरकार टैक्स वसूली पे चलती है!#TaxExtortion pic.twitter.com/dnQu5m7D6T
— Rahul Gandhi (@RahulGandhi) July 7, 2021आपकी गाड़ी चाहे पेट्रोल पे चलती हो या डीज़ल पे, मोदी सरकार टैक्स वसूली पे चलती है!#TaxExtortion pic.twitter.com/dnQu5m7D6T
— Rahul Gandhi (@RahulGandhi) July 7, 2021
" మీ కారు పెట్రోల్ లేదా డీజిల్‌తో నడుస్తుంది. మోదీ ప్రభుత్వం మాత్రం పన్ను దోపిడితో నడుస్తోంది."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్ర నాయకుడు
దిల్లీలో పెట్రోల్ ధర రూ.100 దాటిన క్రమంలో ఈ మేరకు దుయ్యబట్టారు. అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గుల కారణంగా తాజాగా లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 17పైసలు వరకు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.21 పైసలకు చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.89.53పైసలకు ఎగబాకింది.
ఇప్పటికే దేశంలో ముంబయి, చెన్నై, హైదరాబాద్, పుణె వంటి నగరాల్లో పెట్రోల్ ధర సెంచరీ దాటింది. కోల్‌కతాలోనూ పెట్రోల్ ధర బుధవారం వంద రూపాయలకు చేరింది.
ఇవీ చదవండి:'పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న మోదీ'